Begin typing your search above and press return to search.
ఈమె లాంటి దురదృష్ట ఎన్నారైలు 2లక్షల మంది!
By: Tupaki Desk | 11 April 2017 4:31 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న విధానాలు భారతీయ కుటుంబాల్లో పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. అసాధారణ నైపుణ్యం ఉన్న జీవిత భాగస్వాములు అమెరికాలో పనిచేయడానికి గతంలో ఒబామా సర్కార్ అనుమతించింది. కానీ, ట్రంప్ సర్కార్ రద్దు చేయాలని భావిస్తోంది. దీంతో దాదాపు రెండు లక్షల మంది భారతీయుల జీవితాలు తీవ్రమైన ఇక్కట్లకు లోనయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. తాజాగా ఈ ఘటనపై అమెరికా మీడియాతో మాట్లాడిన ఓ ఎన్నారై అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భారత్ కు సుదర్శన్ సేన్ గుప్తా అమెరికాలో ఒక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనశాల్లో పనిచేస్తున్నారు. ఎన్నో కలలు కని, వాటిని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లారు. ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించడానికి అత్యంత చేరువలో ఉన్నారు. సేన్ గుప్తా కలలన్నీ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ట్రంప్ పుణ్యామా అని ఈ షాక్ తగిలింది. నూతన విధానం అమలైతే అమెరికాలో శాశ్వత పౌరులు కావాలనుకున్న సేన్ గుప్తా వంటి రెండులక్షల మంది జీవిత భాగస్వాముల కలలు చెదిరిపోయినట్టే. ``నేను అన్ని నియమనిబంధనలు పాటించాను. భారత్ కు తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. నా కొడుకు - భర్తను విడిచి ఉండలేను`` అని 43 ఏళ్ల సేన్ గుప్తా పేర్కొన్నారు. ట్రంప్ సర్కార్ నిర్ణయంతో తన వృత్తి ప్రమాదంలో పడుతుందని ఆమె ఊహించలేదు. 28 ఏళ్ల వయసులో ఆమె అమెరికా వెళ్లారు. 2002లో ఆమె భర్త సాధక్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ను ప్రారంభించారు. విజిటింగ్ స్కాలర్ జీవి త భాగస్వామిగా ఆమె ఉద్యోగం చేయడానికి అనుమతికి పొందారు.
అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఆమె, భర్త 2005లో హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రీన్ కార్డు ప్రక్రియను ప్రారంభించిన హెచ్-1బీ వీసాదారులు మాత్రమే తమ వీసాలను పునరుద్ధరించుకొనేందుకు వీలుంటుంది. వారి జీవిత భాగస్వాములకు ఈ అవకాశం లేదు. గ్రీన్ కార్డు పొందడానికి సేన్ గుప్తా ప్రయత్నాలు ప్రారంభించలేదు. చివరికి తన భర్త ద్వారా గ్రీన్ కార్డు ను పొందవచ్చని ఆమె భావించారు. ఆమె హెచ్-1బీ వీసా గడువు 2013లో ముగిసింది. దీంతో ఆమె అక్క డ పనిచేయడానికి అనర్హులు అయ్యారు. గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ అమెరికాలో పనిచేయాలనుకున్న జీవిత భాగస్వాములకు 2015లో ఒబామా సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే ట్రంప్ తాజాగా తీసుకోబోయే నిర్ణయం కలకలం రేకెత్తిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/