Begin typing your search above and press return to search.
ఈ హాంకాంగ్ రియల్ పోకిరి మామూలోడు కాదు
By: Tupaki Desk | 14 Aug 2017 10:19 AM GMTబ్లాక్ బస్టర్ మూవీ పోకిరి గుర్తుందా? అండర్‌కవర్ కాప్ గా మహేశ్ బాబు అదరగొట్టేసిన వైనం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. రీల్ లో ఓకే కానీ రియల్ లో అలా సాధ్యమేనా? అన్న ప్రశ్న వేస్తే నో అంటే నోచెబుతారు. కానీ.. ఇప్పుడు చెప్పే రియల్ స్టోరీ వింటే మాత్రం ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. రీల్ పోకిరికి తలదన్నేలా చేసిన ఈ రియల్ పోకిరి ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడు? అన్న విషయాల్లోకి వెళితే..
హాంకాంగ్ కు చెందిన ఒక పోలీస్ అధికారి ప్రాణాలకు తెగించి మరీ ఒక భారీ అండర్ కవర్ ఆపరేషన్ చేశాడు. ఈ దశాబ్దంలోకెల్లా ఇదే అత్యంత ప్రమాదకర ఆపరేషన్ గా హాంకాంగ్ పోలీసు శాఖ చెబుతోంది. దాదాపు 11 నెలల పాటు నిర్వహించిన ఈ అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా 299 మంది గ్యాంగ్ స్టర్ ను పోలీస్ శాఖకు పట్టించాడు.
అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా తన పేరును మార్చేసుకోవటమే కాదు.. ఈ ఆపరేషన్ కోసం ఏకంగా 13 కేజీల బరువు తగ్గేశాడు. కుటుంబ సభ్యులతోనూ.. స్నేహితులతోనూ రిలేషన్స్ మొత్తాన్ని తుంచేసుకున్నాడు. తనను ఎవరూ గుర్తు పట్టని రీతిలో తయారయ్యాడు. చాలా కష్టపడి మాపియాలో చేరాడు. అయితే.. అతన్ని గ్యాంగ్ స్టర్స్ నమ్మటం చాలా కష్టమైందని చెబుతున్నారు.
మొదట్లో అతన్ని ఎవరూ నమ్మలేదట. చాలా కఠినమైన పరీక్షలు పెట్టేవారట. అండర్ కవర్ ఆపరేషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన పలు సినిమాల్ని చూపించి.. ఇతడి ముఖకవళికలు జాగ్రత్తగా గమనించేవారట. అనుక్షణం ప్రాణభయంతో పని చేస్తూ.. గ్యాంగ్ స్టర్స్ వివరాల్ని సేకరించి పోలీస్ శాఖకు అందించాడట. ఇలాంటి కఠినమైన ఆపరేషన్స్ ను ఆర్నెల్లకు మించి ఎవరూ చేయలేరని.. కానీ.. ఇతను మాత్రం అందుకు భిన్నంగా 11 నెలలు పాటు చేయటం మామూలు విషయం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఈ పోలీస్ అధికారికి తిరిగి విధుల్లో హాజరయ్యే సమయంలో ప్రమోషన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. భద్రత రీత్యా అతని పేరు.. వివరాలు బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. రీల్ కు మించిన ఎగ్జైంటీ ఈ రియల్ పోకిరిని తెలుసుకునేటప్పడు కలిగింది కదూ.