Begin typing your search above and press return to search.

దా​వూద్‌ ను న‌డిబ‌జారులో నిల‌బెట్టారు

By:  Tupaki Desk   |   9 Dec 2015 3:50 PM GMT
దా​వూద్‌ ను న‌డిబ‌జారులో నిల‌బెట్టారు
X
అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు ప్ర‌స్తుతం దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలుసుకుంటే ఉరివేసుకొని లేదా పెట్రోల్ పోసుకొని అయినా చ‌నిపోతాడేమో! అదేంటి త‌న రాక్ష‌స బుద్దితో 1993 ముంబై బాంబు దాడులకు కార‌ణ‌మై వంద‌లాది మందిని పొట్ట‌న‌పెట్టుకున్న దావుద్ స్వ‌యంగా చ‌నిపోతాడా? అంత కర్క‌శంగా వ్య‌వ‌హ‌రించే దావుద్‌ ను ఇలాంటి స్థితికి తీసుకుపోయే సంఘ‌ట‌న ఏం జ‌రిగింద‌బ్బా అనుకుంటున్నారా. దావుద్ విష‌యంలో చాలా ఆస‌క్తిక‌ర‌మైన అప్‌ డేట్ తాజాగా చోటుచేసుకుంది.

బాంబు పేలుళ్ల నిందితుడు అయిన దావుద్ ఇబ్ర‌హీం భార‌త పోలీసుల‌కు దొర‌క‌కుండా ఉండేందుకు త‌ప్పించుకుపోయిన సంగ‌తి తెలిసిందే. దావుద్ ప్ర‌స్తుతం పాకిస్తాన్‌ లో ఉన్నట్లు భావిస్తున్నారు. దావుద్‌ ను భార‌త్‌ కు రప్పించేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌లం కావ‌డంతో భార‌త్ కొత్త మార్గంలో ఆయ‌న్ను హింసిస్తోంది. తాజాగా ఆయ‌న ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. దక్షిణ ముంబై ప్రాంతంలొని హొటల్‌ డిప్లొమాట్‌ లో ఆయ‌న మాజీ వ‌స్తువులు వేలం వేశారు. దావూద్‌ కారును తాజాగా వేలం వేయ‌గా...విచిత్రంగా క‌ర‌డుగ‌ట్టిన ఈ క్రిమిన‌ల్‌ కు చెందిన ఆస్తిని ఓ హిందూ స్వామీజి కొనుగోలు చేశారు. వేలంలో పాల్గొని కొనుగోలు చేయ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశం అనుకుంటే....తాను కొన్న దావుద్ పాత ఆస్తిని ఏం చేయ‌నున్నాడో ప్ర‌క‌టించి మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగించారు.

హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి దావుద్ వాడిన కారును 3 లక్షల 20 వేల రూపాయిలకు కొన్నారు. ఇంత‌కీ దావూద్‌ కు చెందిన ఈ మాజీ కారును ఏం చేయ‌నున్నాడంటే...అగ్నికి ఆహుతి చేస్తార‌ట‌. అలా చేయ‌డానికి తాను కొనాలని భావిస్తున్నట్లు స్వామి చక్రపాణి వేలం పాటకు ముందు చెప్పారు. ఇదిలా ఉండ‌గా రౌన‌క్ అఫ్రోజ్ పేరుతో దావుద్ ఇబ్ర‌హీం ముంబైలో ఉన్న‌పుడు నిర్వ‌హించిన హోట‌ల్‌ కు బిడ్డింగ్ నిర్వ‌హించ‌గా అత్యధికంగా 4.28 కోట్ల‌కు అమ్ముడుపోయింది. మ‌రోవైపు దావుద్‌ కు చెందిన హ్యుండ‌య్ అసెంట్ సెడాన్ కారు కేవ‌లం 4,000 రూపాయ‌ల‌కు అమ్ముడుపోయింది. ఈ కారు 15 ఏళ్ల క్రితానికి చెందింది.

మొత్తంగా ముంబై బాంబ్ బ్లాస్ట్‌ ల‌తో దేశం ప‌రువును దావుద్ తీస్తే...ఆయ‌న‌కు చెందిన ఆస్తుల‌ను తుక్కు కింద‌ వేలం వేసి భార‌త‌దేశం త‌న ప్ర‌తికారాన్ని తీర్చుకున్న‌ట్ల‌యంది.