Begin typing your search above and press return to search.

రూ.9,334 కోట్ల బ్లాక్ మ‌నీ తేలింది

By:  Tupaki Desk   |   14 April 2017 12:43 PM GMT
రూ.9,334 కోట్ల బ్లాక్ మ‌నీ తేలింది
X
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఐటీ శాఖ త‌న దూకుడును పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆప‌రేష‌న్ క్లీన్‌ మ‌నీ రెండో ఫేజ్‌ ను మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగా నోట్ల‌ ర‌ద్దు త‌ర్వాత న‌ల్ల‌ధ‌నాన్ని బ‌య‌ట‌పెట్టే క్ర‌మంలో తాజాగా 60 వేల మందికి నోటీసులు జారీ చేసింది. ఇలా ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు ఐటీ శాఖ రూ.9334 కోట్ల లెక్క‌లు లేని సంపాద‌న‌ను బ‌య‌ట‌పెట్టింది. అయితే వీరి వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేమ‌ని ఐటీ శాఖ తెలిపింది. స‌ద‌రు ఖాతాదారులు త‌మ నోటీసుల‌కు స్పందించ‌కుంటే అప్పుడు త‌గు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపింది. జ‌న‌వ‌రి 31న ఐటీ శాఖ ఈ ఆప‌రేష‌న్ క్లీన్‌ మ‌నీని మొద‌లుపెట్టింది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌వంబ‌ర్ 9 - డిసెంబ‌ర్ 30 మ‌ధ్య జ‌రిగిన లావాదేవీల‌ను క్షుణ్నంగా ప‌రిశీలిస్తోంది.

తొలి ఫేజ్‌ లో భాగంగా ఐదు ల‌క్ష‌ల‌కు పైగా డిపాజిట్లు చేసిన 18 ల‌క్ష‌ల‌కుపైగా అనుమానిత ఖాతాదారుల‌కు ఎస్సెమ్మెస్‌ - ఈమెయిల్స్‌ ను పంపించింది. జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు ఐటీ శాఖ రూ.5400 కోట్ల అక్ర‌మ సంపాద‌న‌ను గుర్తించిన‌ట్లు ఏప్రిల్ 9న కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డేటా అన‌లిటిక్స్‌ ను ఉప‌యోగించి ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే వారు నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో జ‌రిపిన లావాదేవీల‌ను ప‌రిశీలించారు. అంద‌రూ త‌మ డిపాజిట్ల‌ను ఈ-వెరిఫై చేసుకోవాల‌ని కూడా ఐటీ శాఖ సూచించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/