Begin typing your search above and press return to search.

సీరం అగ్నిప్రమాద ఘటనలో సంచలన విషయాలు

By:  Tupaki Desk   |   23 Jan 2021 10:09 AM GMT
సీరం అగ్నిప్రమాద ఘటనలో సంచలన విషయాలు
X
దేశానికి కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' అందించిన మహారాష్ట్రలోని 'సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా'లో అగ్నిప్రమాదం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ప్రమాదమా? లేక విధ్వంసమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా దీనిపై దర్యాప్తు ప్రారంభించామని.. విచారణ పూర్తయిన తర్వాత ఇది ప్రమాదమా? విధ్వంసమా తెలుస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సీఎం ఉద్దవ్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సీరం సీఈవో అదర్ పూనావాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీరం అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారని.. వారి కుటుంబ సభ్యుల బాధ్యత సీరం ఇన్ స్టిట్యూట్ తీసుకుంటుందని సీఎం ఉద్దవ్ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కేంద్రానికి ఎలాంటి హానీ జరగలేదని.. వేరే టీకాలు తయారు చేస్తున్న కేంద్రాల్లోనే ప్రమాదం జరిగిందని ఉద్ధవ్ వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరం ఉందని సీఎం తెలిపారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో దాదాపు 1000 కోట్ల నష్టం జరిగిందని కంపెనీ సీఈవో అధర్ పూనావాలా తెలిపారు. కోవిడ్ 19 టీకా నిల్వచేయని భవనంలో ఈ సంఘటన జరిగినందున తాము చాలా అదృష్టవంతులమన్నారు.

ఇక ఈ అగ్నిప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం మూడు ఏజెన్సీల ద్వారా విచారణకు సిద్ధమైంది. దీనిలో నిగ్గు తేలిన తర్వాత అసలు దోషులు ఎవరన్నది తేలనుంది.