Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్రప‌తి అన్సారీ నోట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:43 PM GMT
ఉప‌రాష్ట్రప‌తి అన్సారీ నోట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
మ‌రికొద్ది రోజుల్లో ఉప రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న హ‌మీద్ అన్సారీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వులో ఉన్న ఆయ‌న‌.. త‌న పద‌విని వ‌దిలిపెట్టే కొద్ది రోజుల ముందు ఒక వ‌ర్గం గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. కొత్త త‌ర‌హా చ‌ర్చ‌కు తెర తీశాయ‌ని చెప్పాలి. ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌విలో ఉంటూ ఇచ్చిన చివ‌రి మీడియా ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేశార‌ని చెప్పాలి. రాజ్య‌స‌భ టీవీకి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో అన్సారీ మాట్లాడుతూ.. అస‌హ‌నం అంశాన్ని ప్ర‌ధాని మోడీతో పాటు.. ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల వ‌ద్ద తాను ప్ర‌స్తావించిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ప్ర‌జ‌ల జాతీయ‌త గురించి ప్ర‌శ్నించ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెప్పిన ఆయ‌న‌.. తాను ప్ర‌ధాని వ‌ద్ద చ‌ర్చించిన అంశాల‌పై గోప‌త్య పాటించాల్సిన అవ‌స‌రం ఉందంటూనే.. చెప్పాల్సిన విష‌యాల్ని ఆయ‌న చెప్పేయ‌టం గ‌మ‌నార్హం. అస‌హ‌నం గురించి మోడీ స‌ర్కారు నుంచి ఎలాంటి స్పంద‌న వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఏ విష‌యానికైనా వివ‌ర‌ణ ఉంటుంద‌ని.. అదే విధంగా కార‌ణంగా ఉంటుంద‌న్నారు.

ఇప్పుడు తీర్పు గురించి మాట్లాడుకుంటే.. వివ‌ర‌ణ‌ను అంగీకరిస్తే.. కార‌ణాల‌ను అంగీక‌రించిన‌ట్లే అవుతుంద‌న్నారు. అదే తార్కిక ప్రాతిప‌దిక అవుతుంద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ముస్లింలు భ‌యాందోళ‌న‌లో ఉన్నార‌న్న వాద‌న‌తో ఏకీభ‌విస్తారా? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. అది స‌రైన‌దే అని చెప్ప‌టం విశేషం.

దేశంలో వివిధ వ‌ర్గాల ద్వారా తాను విన్న దాని ప్ర‌కారం అది వాస్త‌వ‌మేన‌న్న ఆయ‌న‌.. తాను బెంగ‌ళూరులోనూ.. అదే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంద‌న్నారు. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌రాదిలో ఈ అంశంపై తెలుసుకున్న విషయాల్ని చూస్తే.. ముస్లింల‌లో అభ‌ద్ర‌త‌.. ఆందోళ‌న‌లు నెమ్మ‌దిగా పాకుతున్నాయ‌న్నారు. తాము కావాల్సిన వాళ్లం కాద‌నే భావ‌న ముస్లింల‌లో మొద‌లైందా? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం తాను అంత దూరం వెళ్ల‌న‌ని వ్యాఖ్యానించారు.

దేశంలో శ‌తాబ్దాలుగా ప‌ర‌స్ప‌ర ఆమోదం ఉన్న వాతావ‌ర‌ణం ఉంద‌ని.. ఇప్పుడు దానికి ముప్పు ఏర్ప‌డింద‌న్నారు. జాతీయ‌వాదాన్ని రోజూ చాటుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న అన్సారీ.. నేను భార‌తీయుడ్ని అంతేన‌న్నారు. స‌హ‌నం మంచి ల‌క్ష‌ణ‌మేన‌న్న ఆయ‌న‌.. అదొక్క‌టే స‌రిపోద‌న్న వ్యాఖ్య‌ను చేశారు. ప‌ద‌వి నుంచి వైదొలుగుతున్న వేళ అన్సారీ చేసిన వ్యాఖ్య‌లు రానున్న రోజుల్లో పెద్ద చ‌ర్చ‌కు తెర తీయటం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.