Begin typing your search above and press return to search.
ఉపాధి లేక రేప్ లు చేస్తున్నారట!
By: Tupaki Desk | 15 Sep 2018 2:00 PM GMTప్రస్తుతం ప్రజాప్రతినిధలుగా ఎన్నికైన కొందరు వ్యక్తులు నిత్యం తమ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరుల కన్నా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రులు ....బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఘటనలు కోకొల్లలు. ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేయడంలో మిగతా పార్టీల వారితో పోలిస్తే....బీజేపీ నేతలు అగ్రతాంబూలం అందుకుంటారన్న సంగతి తెలిసిందే. గతంలో తమ వివాదాస్పద వ్యాఖ్యలతో పలువురు బీజేపీ నేతలు వార్తల్లో కేంద్రబిందువుగా మారారు. తాజాగా, హరియాణాలోని ఉచానా కాలన్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్‌లతా ...ఓ రేప్ కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేనందునే తీవ్ర ఒత్తిడికి లోనై అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రేమ్ లతా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హర్యానాలో సీబీఎస్ ఈ టాపర్ పై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి వెళుతోన్న బాధితురాలిని కారులో వచ్చిన ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తునకు హరియాణా ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రేమ్ లతా ఆ రేప్ నిందితులనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి లేని యువత ఆ ఒత్తిడిలో కోపం వల్ల అత్యాచార నేరాలకు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని - నిందితులను పట్టించేందుకు సాయం చేస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా..ఒక మహిళా ఎమ్మెల్యే అయి ఉండి...ఇటువంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.