Begin typing your search above and press return to search.
నిరుద్యోగ దీక్షలు షర్మిలకు కలిసి రావడం లేదా? వ్యూహం యూటర్న్!
By: Tupaki Desk | 6 Sep 2021 3:30 PM GMTఎంత దూకుడు చూపించినా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు మైలేజీ రావడం లేదు. పైగా ఆమెకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. దీంతో ఇప్పుడు వ్యూహం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో టీఆర్ ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా ఉన్న షర్మిల.. నిరుద్యోగంపై పోరు చేస్తున్నారు. నిరుద్యోగుల తరఫున గళం వినిపిస్తున్నారు. వారికి న్యాయం చేయాలంటూ.. దీక్షలు కూడా చేస్తున్నారు. అయితే.. వీటికి మైలేజీ రావడం లేదు. పైగా ఆయా కుటుంబాలు కూడా ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగ దీక్షలపై వైఎస్ షర్మిల రూటు మార్చారు.
వాస్తవానికి రేపటి నుంచి యూనివర్సిటీల ముందు దీక్షలు చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. అయితే షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గి.. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కేవలం మంగళవారాలు మాత్రమే దీక్ష చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ముందు నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయించారు. అదేసమయంలో ఇక నుంచి ప్రతి మంగళవారం యూనివర్సిటీ ముందు ఆందోళనలు చేయాలని భావిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సం నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించి అక్కడే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 12 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వరుసగా 8 చోట్ల ఉద్యోగ దీక్షలు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలు దీక్షలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. రెండు చోట్ల కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. మంచిర్యాల జిల్లా సిరిసేడులో ఓ నిరుద్యోగి కుటుంబం షర్మిలను రావొద్దని విజ్ఞప్తి చేసింది.
ముందుగా అనుకున్నట్లు రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న 167 కుటుంబాలను షర్మిల పరామర్శించాలని అనుకున్నారు. అయితే ఆ సంకల్పానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని షర్మిల భావించారు. దీంతో ఆమె రూటు మార్చుకున్నారు. ఇందులో బాగంగానే రేపటి నుంచి (మంగళవారం) నుంచి యూనివర్సిటీల ముందు ఆందోళనకు సిద్దమవుతున్నారు.