Begin typing your search above and press return to search.

ఇది నిజం: ‌లాక్‌ డౌన్ త‌ర్వాత నిరుద్యోగిత త‌గ్గిందంట‌

By:  Tupaki Desk   |   24 Jun 2020 11:30 PM GMT
ఇది నిజం: ‌లాక్‌ డౌన్ త‌ర్వాత నిరుద్యోగిత త‌గ్గిందంట‌
X
మ‌హ‌మ్మారి వైర‌స్ రాక‌తో అన్ని ఆర్థిక కార్యక‌లాపాలు ఆగిపోయిన విష‌యం తెలిసిందే. ఐదు ద‌శ‌ల లాక్‌డౌన్ అనంత‌రం అన్‌లాక్ సీజ‌న్ న‌డుస్తోంది. అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆర్థిక కార్య‌క‌లాపాలు పుంజుకున్నాయి. మూత‌ప‌డిన ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు, సంస్థ‌లు తిరిగి తెరుచుకోవ‌డంతో ఇప్పుడు నిరుద్యోగిత త‌గ్గిందంట‌. లాక్‌డౌన్‌తో పోలిస్తే ఇప్పుడు నిరుద్యోగిత శాతం త‌గ్గింద‌ని కొన్ని సంస్థ‌లు, స‌ర్వేలు చెబుతున్నాయి.

వైర‌స్ ప్ర‌వేశంతో లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ మూడు నెల‌ల లాక్‌డౌన్‌లో పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు కోల్పోయారు. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న ఏప్రిల్‌, మే నెల‌ల్లో నిరుద్యోగిత రేటు 23.5 శాతంగా ఉంది. మే మూడో వారానికి చేరుకునే స‌రికి ఆ రేటు ఏకంగా 27.1 శాతానికి చేరింది. త‌ర్వాత జూన్‌లో లాక్‌డౌన్ క్ర‌మంగా ఎత్తివేయ‌డం ప్రారంభించారు. ఆర్థిక కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయి. వ్యాపార‌, ఆర్థిక కార్య‌క్ర‌మాలు మొద‌ల‌వ‌డంతో క్ర‌మంగా నిరుద్యోగిత స్థాయి త‌గ్గిందంట‌. లాక్‌డౌన్‌తో పూర్తిస్థాయిలో మూత‌ప‌డ్డ రంగాలు తెరుచుకోవ‌డంతో నిరుద్యోగిత స్థాయి త‌గ్గ‌డానికి కార‌ణంగా తెలుస్తోంది. ఎంత‌లా అంటే సింగిల్ డిజిట్‌కు నిరుద్యోగిత రేటు చేరుకుంది. 8.5 శాతంగా ప్ర‌స్తుతం నిరుద్యోగిత రేటు ఉంది. ఇది ఇప్పుడు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం ఈ రేటు ఉంది.