Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్య జ‌గ‌న్ ఇప్ప‌టికి గుర్తించారు...!

By:  Tupaki Desk   |   28 Sep 2021 4:31 AM GMT
హ‌మ్మ‌య్య జ‌గ‌న్ ఇప్ప‌టికి గుర్తించారు...!
X
తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌లో అనూహ్య‌మైన మార్పు క‌నిపిస్తోంది. నిజానికి ఇంత తొంద‌ర‌గా.. ఈ మార్పు వ‌స్తుంద‌ని.. ఎవ‌రూ అనుకోలేదు. అనుకోరు కూడా..! ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌రిణామాలు అలా ఉన్నాయి కాబ‌ట్టి. అయితే.. జ‌గ‌న్ మాత్రం ముందుగానే మేల్కొన్న‌ట్టు క‌నిపిస్తోంది. అదేంటంటే.. హిందూ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను ఆయ‌న త‌న‌వైపు తిప్పుకోవ‌డం! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇప్పుడు ఎన్నిక‌లు లేవు క‌దా..! ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు తెర‌మీద‌కి వ‌చ్చింది ? అనే చ‌ర్చ కూడా వ‌స్తుంది. కానీ, ఇప్పుడు ఎన్నిక‌లు లేక‌పోయినా.. చాపకింద నీరులా.. జ‌గ‌న్‌పైనా.. ఆయ‌న పార్టీపైనా హిందూ వ్య‌తిరేకి అనే ముద్ర ప‌డుతోంది.

ఇదే విష‌యాన్ని విశాఖ శార‌దాపీఠాధిప‌తి.. స్వామి స్వ‌రూపానందేంద్ర స్వామి కూడా హెచ్చరించారు. టీటీడీ బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను ఇస్తు ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేయ‌డం.. దేవాల‌యాల‌పై దాడులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆల‌యాల్లో అవినీతి పెరిగిపోయింద‌నే వాద‌న‌లు ఇలా.. అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనికితోడు.. ప్ర‌తిప‌క్షాలు కూడా జ‌గ‌న్‌ను తీవ్ర‌స్థాయిలో ఏకేస్తున్నాయి. ఆయ‌న క్రిస్టియ‌న్ కాబ‌ట్టే ఇలా జ‌రుగుతోంద‌ని ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు కాక‌పోయినా.. మ‌రికొన్నాళ్ల‌క‌యినా..త‌న‌పై హిందూ వ్య‌తిరేక‌త పెరిగితే.. అది మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. ఆయ‌న గుర్తించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా తీసుకున్న నిర్ణ‌యం.. సంచ‌ల‌నంగా మారింది.

హిందూ ఆల‌యాల‌పై తాజాగా జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆల‌యాల్లో అవినీతి అనే మాట వినిపించ‌కూడ‌దు అని సీరియ‌స్‌గా ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఇదే హిందువులు కోరుకున్నారు., అదే జ‌గ‌న్ చేశారు. అదే స‌మ‌యంలో ఆల‌యాల్లో పూజా టికెట్ల ధ‌ర‌ల‌ను నిర్న‌యించేందుకు ఒక క‌మిటీని వేసి.. సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని సూచించారు. అదేవిధంగా.. అన్ని టికెట్ల విక్ర‌యాల‌ను ఆన్‌లైన్ చేయాల‌ని.. దీనివ‌ల్ల భ‌క్తుల‌కు అందుబాటులో ఉండ‌డ‌మే కాకుండా.. అవినీతిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని.. అకౌంట‌బిలిటీ పెరుగుతుంద‌ని సూచించారు.

ఇక‌, కొత్త‌గా దుర్గ‌మ్మ ఆల‌యంలో ధ‌ర్మ‌ప‌థం అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. మ‌రిన్ని ఆల‌యాల్లోనూదీనిని విస్త‌రించ‌నున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. హిందూ ఆగ్ర‌హాన్ని జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా.. త‌గ్గిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, బీజేపీ కి కూడా ఆయ‌న ప‌రోక్షంగా చెక్ పెట్టిన‌ట్టే అవుతుంద‌ని చెబుతున్నారు.