Begin typing your search above and press return to search.
అనూహ్య కలయికలు... ఎన్నో ఊహాగానాలు... ?
By: Tupaki Desk | 11 Dec 2021 2:30 AM GMTఅనూహ్య కలయికలు... ఎన్నో ఊహాగానాలు... ?రాజకీయాల్లో ఒక ముతక సూత్రం ఉంది. అక్కడ ఎవరూ ఎవరికీ శత్రువులు కారు. అదొక గేమ్. ఇంకో మాట చెప్పాలీ అంటే ఎపుడూ అక్కడ అవకాశాలు ఉంటాయి. వెతుక్కోవడమే కావాల్సిన వారి పని. అందుకోసం ఎవరైనా రెడీగా ఉంటే ఎన్నో మలుపులూ పిలుపులూ ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తోంది. అన్నీ మంచి ముహూర్తాలే. దాంతో వరసబెట్టి పెళ్ళి బాజాలు మోగుతున్నాయి. అలాగే నిశ్చితార్ధాలు జరుగుతున్నాయి.
రెండు రోజుల వ్యవధిలో హైదరాబాద్ వేదికగా జరిగిన రెండు పెద్ద కుటుంబాల వివాహ నిశ్చితార్ధాలలో అనూహ్య కలయికలు సంభవించాయి. దీంతో వీటి చుట్టూ అల్లుకుని ఏపీ రాజకీయ సమీకరణల మీద జోరుగా విశ్లేషణలు అయితే సాగుతున్నాయి. మొదటగా చెప్పుకొవాల్సింది స్వర్తీయ ఎన్టీయార్ ఇద్దరు అల్లుళ్ళ కలయిక. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు నందమూరి వారి ఇంట జరిగిన ఒక పెళ్ళి నిశ్చితార్ధ వేడుకల్లో చాలా కాలానికి కలుసుకున్నారు.
ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారని, అరమరికలు లేకుండా కలసిపోయారని అక్కడికి వచ్చిన వారి మాట. మరి దగ్గుబాటి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన సతీమణి పురంధేశ్వరి అయితే బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఇక దగ్గుబాటి కొడుకు హితైష్ చెంచురామ్ కి రాజకీయాల్లోకి రావాలని ఉంది. కానీ సరైన పార్టీ లేకుండా పోయింది. అది వారి విషయం అయితే చంద్రబాబు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నారు.
ఆయన రాజకీయ చరమాంకంలో ఉన్నరు. కుమారుడు లోకేష్ ని పొలిటికల్ గా తీర్చిదిద్ది తాను విశ్రాంతి తీసుకోవాలనే అనుకుంటున్నారు. ఇక ఇద్దరు అల్లుళ్ళూ కలిస్తే టీడీపీకి పూర్వపు కళ వస్తుంది అన్న వారూ ఉన్నారు. ఏపీలో ఒక కమ్మ వారికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్న వేళ ఈ ఇద్దరు నడుం బిగించి టీడీపీ విజయానికి పనిచేస్తే ఏపీలో బలమైన కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటుంది అన్న టాక్ అయితే ఉంది. ఒక విధంగా ఈ కలయిక సాధారణం, కుటుంబ పరమైనదే అయినా దీన్ని అల్లుకుని ఎన్నో ఆశలు ఊసులు ఇపుడు ఏపీ రాజకీయాలలో ప్రత్యేకించి టీడీపీలో మొగ్గతొడుగుతున్నాయి.
ఇదిలా ఉంటే దీనికి ముందు మరో రాజకీయ ప్రముఖుడి ఇంట్లో కూడా కార్యక్రమం జరిగింది. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకైక కుమారుడు డాక్టర్ సందీప్ వివాహ నిశ్చితార్ధం హైదరాబాద్ లోని ఒక హొటల్ లో గ్రాండియర్ గా సాగింది. దీనికి ఏపీ మంత్రులు అంతా దాదాపుగా హాజరయ్యారు. అలాగే ఏపీలో బలమైన కాపు కులానికి చెందిన ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన పెద్దలు హాజరయ్యారు. అక్కడికి అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చుట్టూ ఆయన సామాజిక వర్గం నేతలు, రాజకీయ ప్రముఖులు ముచ్చట్లు పెట్టారు.
దాంతో దాని మీద కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. చిరంజీవి రాజకీయాల్లో లేరు కానీ ఆయన చుట్టూ ఎపుడూ అలాంటి రూమర్స్ చక్కర్లు కొట్టడం కామన్ అయింది. మరో వైపు చూస్తే బొత్స వైసీపీలో సీనియర్ నేత. ఆయన చుట్టూ బలమైన సామాజిక వర్గం ప్రముఖులు చేరడం కూడా చర్చకు తావు ఇస్తోంది. చిత్రంగా రెండూ వివాహ వేడుకలకు సంబంధించిన అంశాలు అయినవే కానీ ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఏ ఇద్దరు కలసినా లెక్కలు కట్టేస్తున్నారు. ఈ ఊహాగానాలు నిజం కాకపోవచ్చు. ఏ మధ్యలోనో ఆగిపోవచ్చు. కానీ రాజకీయ విశ్లేషణలకు మాత్రం మంచి ముడి సరుకు ఇవి అని చెప్పుకోవాల్సిందే.