Begin typing your search above and press return to search.

ఏపీ బ్లాక్ ఫంగస్ కేసుల్లో అనూహ్య పరిణామాలు

By:  Tupaki Desk   |   1 Jun 2021 7:30 AM GMT
ఏపీ బ్లాక్ ఫంగస్ కేసుల్లో అనూహ్య పరిణామాలు
X
కరోనా సోకి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆ మందులో సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఈ కొత్త ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయి. దేశంలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 1179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టుగా వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ముక్కు, నోట్లో తలెత్తే మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేవలం మధుమేషులు (షుగర్ రోగులకు) మాత్రమే పరిమితం కావడం లేదని తేలింది. ఇతర దీర్గకాలిక వ్యాధిగ్రస్తులను, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారినీ కబళిస్తోందని తేలింది.

బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో పురుషులు 780మంది కాగా.. మహిళలు 399 మంది, బాధితుల్లో 743 (63.01శాతం) మంది మధుమేహం ఉన్న వారు. 251 (21.28 శాతం) మంది రోగులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు. 130 (11.02శాతం) మంది ఇతర దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు’ అని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక బ్లాక్ ఫంగస్ రావడానికి ప్రధాన కారణాలుగా కరోనా ఇన్ ఫెక్షన్, మధుమేహం ఉండటం.. స్టెరాయిడ్ ల వినియోగం అధికంగా ఉండడమేనని తేలింది. ఆస్పతుల్లో ఆరోగ్యపరిస్థితిపై వివరాలు సేకరించినప్పుడు దాదాపు 80శాతం మంది కోవిడ్ బారినపడి 3 వారాల పాటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్టు.. ఎక్కువ రోజులు ఆక్సిజన్ పై ఉన్నట్లు తేలింది.

ఇక ఏపీలో బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్స పొందిన వారిలో ఆక్సిజన్ సాయం లేకుండా చికిత్స పొందిన వారే ఎక్కువ అని తేలింది. అలాగే స్టెరాయిడ్లు వాడిన వారి కంటే వాడని వారికే ఈ వ్యాధి ఎక్కువగా వస్తోందని తేలింది.