Begin typing your search above and press return to search.
దేవుడు లాంటి కేసీఆర్ ను ధర్నాలో కూర్చునేలా చేస్తారా అంటూ ఆత్మహత్యయత్నం
By: Tupaki Desk | 19 Nov 2021 5:37 AM GMTతెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్ వద్ద అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించటం సంచలనంగా మారింది. దీనికి కారణం.. దేవుడు లాంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ధర్నా చేసేలా చేయటమేనన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా చూడాలంటూ మంత్రులు.. ప్రజా ప్రతినిధులు రాజ్ భవన్ కు వచ్చారు.
గవర్నర్ తమిళ సైను కలిసి.. వినతిపత్రాన్ని అందజేశారు. ఇందుకోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజ్ భవన్ లోకి వెళ్లిన తర్వాత.. బయట ఉన్న ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేశారు. స్పందించిన అక్కడున్న వారు అతన్ని రక్షించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని సూర్యాపేట జిల్లా మోతే మండలం లాల్ తండాకు చెందిన 38 ఏళ్ల బానోతు నాగరాజుగా గుర్తించారు.
వ్యవసాయ కూలీ అయిన నాగరాజుకు.. సీఎం కేసీఆర్ ను విపరీతంగా అభిమానిస్తుంటారు. గడిచిన కొంతకాలంగా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం రాజ్ భవన్ వద్దకు సీఎం కేసీఆర్ వస్తున్నట్లుగా వార్తా పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూసిన అతను సూర్యాపేట నుంచి రాజ్ భవన్ కు వచ్చాడు. రాజ్ భవన్ కు చేరుకునే వేళలో ఒక బాటిల్ పెట్రోల్ ను తీసుకొని వచ్చాడు.
మధ్యాహ్నం వరకు సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వద్దకు రాకపోవటం.. మంత్రులు.. ఇతర ప్రజాప్రతినిదులు లోపలకు వెళ్లటాన్ని గమనించిన నాగరాజు.. రాజ్ భవన్ ఎదుట పెట్రోల్ ఒంటి మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరలించారు. సీఎం కేసీఆర్ ను ధర్నా చేసే వరకు తీసుకురావటం తనను బాధించిందని అతడు వెల్లడించాడు.