Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ నీడ కూడా పడనివ్వను.. కోర్టుకెక్కిన కన్నకొడుకు

By:  Tupaki Desk   |   21 Jun 2022 10:30 AM GMT
ఎలన్ మస్క్ నీడ కూడా పడనివ్వను.. కోర్టుకెక్కిన కన్నకొడుకు
X
ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన కన్న కొడుకు గ్జావియన్ అలెగ్జాండర్ మస్క్ కోర్టుకెక్కడం సంచలనమైంది. అయితే అది ఆస్తి కోసం కాదు.. తండ్రి పేరుతో సంబంధం లేకుండా బతకడానికి.. ఆయన నీడలో బతకడం ఇష్టం లేక.. అంతమించి సమాజంలో 'జెండర్' గుర్తింపు కోసం కోర్టుకెక్కడం విశేషం.

ఎలన్ మస్క్ మొదటి భార్య కెనడా నటి జస్టిన్ విల్సన్ ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఈ ఇద్దరికీ ఆరుగురు సంతానం. తొలి దఫాలో ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టారు. ఇందులో ఒకడే గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్. ఇతడు అబ్బాయిగా పుట్టినా 'ట్రాన్స్ జెండర్ సర్జరీ' అమ్మాయిగా మారిపోయాడు. వివియన్ జెన్నా విల్సన్ గా పేరు మార్చుకున్నాడు.

తాజాగా 18 ఏళ్లు నిండడంతో ఎలన్ మస్క్ తో తనకు సంబంధాలు వద్దంటూ కోర్టుకెక్కాడు.ఏ విషయంలోనైనా ఆకారం, గుర్తింపులో కన్నతండ్రి ఎలన్ మస్క్ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నా.. ఆయన గుర్తింపు ఇకపై నాకు అక్కర్లేదు. నా పేరు మార్పిడికి అనుమతించండి.. నా లింగమార్పిడికి చట్టబద్ధత ఇవ్వండి అంటూ లాస్ ఎంజెల్స్ కౌంటీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు.

ఏప్రిల్ నెల చివర్లోనే వివియన్ తన పిటీషన్ దాఖలు చేయగా.. అందులోని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలో ఉంటున్న గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్ తన కొత్త పేరుకు గుర్తింపు ఇవ్వడంతోపాటు కన్నతండ్రి ఎలన్ మస్క్ గుర్తింపునకు, ఆయన అందించే సాయాలను రద్దు చేయాలని పిటీషన్ లో పేర్కొన్నాడు. తండ్రి నీడలో బతకడం ఇష్టం లేదంటూ పిటీషన్ లో పేర్కొన్నాడు.

ఇక ఎలన్ మస్క్ కు, ట్రాన్స్ జెండర్ గా మారిన కూతురు మధ్య గొడవ ఏంటన్న దానిపై స్పష్టత లేదు. ఇరు పక్షాల లాయర్స్ సైతం దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

ట్రాన్స్ జెండర్ హక్కుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీకి ఎలన్ మస్క్ మద్దతు ప్రకటించారు. తాజా చట్టం ప్రకారం అమెరికాలో ట్రాన్స్ జెండర్ హక్కులపై పరిమితులు ఉండనున్నాయి. తండ్రి వైఖరిపై అసంతృప్తితోనే గ్జావియర్ ఇలా పిటీషన్ వేసి ఉండవచ్చని భావిస్తున్నారు.