Begin typing your search above and press return to search.
పట్టాభి మిస్సింగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఆచూకి దొరికేసింది..!
By: Tupaki Desk | 25 Oct 2021 1:49 PM GMTసీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో అరెస్టు అయిన టీడీపీ నేత పట్టాభి అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యాఖ్యల తర్వాతే వైసీపీ వాళ్లు ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం.. ఆ తర్వాత పట్టాభిని అరెస్టు చేసి రాజమండ్రి కేంద్ర కర్మాగారానికి తరలించడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపైనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అలెర్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే.. చంద్రబాబు ఏకంగా 36 గంటల పాటు దీక్ష చేశారు. చివరకు ఆయన ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.
ఇక పట్టాభి బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు ఆయనకు రెండు రోజుల క్రిందటే బెయిట్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. వాస్తవంగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినా హైకోర్టు ఎంట్రీతో పట్టాభికి త్వరగానే బెయిల్ వచ్చింది. మీడియాలో ఎప్పుడూ హైలెట్ అయ్యే పట్టాభి బయటకు వచ్చాక ఎక్కడున్నారో ఎవ్వరికి తెలియలేదు. ఆయన బయటకు రాకపోవడంతో పట్టాభి మిస్ అయ్యారని కొందరు.. ఆయన్ను టీడీపీ నేతలే దాచేశారని వైసీపీ వాళ్లు రకరకాలుగా ప్రచారం చేశారు.
అటు టీడీపీ వాళ్లు కూడా దీనిపై నోరు మెదపక పోవడంతో అసలు పట్టాభి ఏమయ్యాడన్న సందేహాలు అందరి మదిలోనూ మెదిలాయి. అయితే ఇప్పుడు పట్టాభి ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన మల్దీవ్స్ వెళ్లాడని తెలుస్తోంది. ఈ ప్రచారం జోరుగా వైరల్ అవుతోంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం బెయిల్‌పై బయటకు వచ్చిన పట్టాభి దేశం విడిచి ఎలా ? వెళతారని ప్రశ్నిస్తున్నారు.
ఇది మరో తప్పిదం అవుతుందని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. టీడీపీ వాళ్లు మాత్రం పట్టాభిపై దేశం విడిచి వెళ్లిపోయేంత దేశ ద్రోహం కేసులు ఏమీ లేవని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నవి పాత ఫొటోలు అని చెపుతున్నారు. మరి దీనిపై పట్టాభి కాని , టీడీపీ వాళ్లు కాని స్పందిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి.