Begin typing your search above and press return to search.

భారత్ లో 4.6 కోట్ల మంది అమ్మాయిల అదృశ్యం..ఏమయ్యారు?

By:  Tupaki Desk   |   1 July 2020 5:30 PM GMT
భారత్ లో 4.6 కోట్ల మంది అమ్మాయిల అదృశ్యం..ఏమయ్యారు?
X
ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక భారత్ లో అమ్మాయిల భద్రత ఏపాటిదో తేటతెల్లం చేసింది. గత ఐదు దశాబ్దాల్లో భారత్ లో ఏకంగా 4.58 కోట్ల మంది మహిళలు అదృశ్యం అయ్యారని.. ఏమయ్యారో ఇప్పటికీ తెలియలేదని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ నివేదిక ఎండగట్టింది. గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 14.25 కోట్ల మంది మహిళలు అదృశ్యమయ్యారని.. వీరిలో చైనా, భారత్ తోనే ఎక్కువమంది ఉన్నారని ఐరాస నివేదిక వెల్లడించింది.

1970 నుంచి 50 ఏళ్లలో చైనాలో 72.3 మిలియన్ల మంది మహిళలు కనిపించకుండా పోయినట్టు తెలిపింది. ప్రసావనంతరం, లింగ వివక్ష కారణంగానే మహిళలు, బాలికలు తప్పిపోయారని ఐరాసా నివేదిక తెలిపింది. 2013 నుంచి ఏడాదికి సగటున 460000 మంది బాలికలు కనిపించకుండా పోతున్నారని తేల్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 1.2-1.5 మిలియన్ల మంది అదృశ్యమవుతుండగా.. భారత్, చైనాలోనే 90-95శాతం మంది ఉన్నారని ఐరాసా తెలిపింది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే 2055 నాటికి మహిళల సంఖ్య లేక పెళ్లికాని పురుషుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని.. 50 ఏళ్లు వచ్చినా పెళ్లికాదని.. పురుషుల నిష్పత్తి 10 శాతం పెరుగుతుందని ఐరాసా స్పష్టం చేసింది. లింగ వివక్షతను దేశాలు రూపుమాపాలని కోరాయి.