Begin typing your search above and press return to search.
ముద్దు ఇస్తే.. భర్త నాలుక కొరికేసిన భార్య!
By: Tupaki Desk | 24 Sep 2018 5:40 AM GMTభర్తలు పారాహుషార్. గొడవ పడి.. హాట్ హాట్ గా ఉన్న భార్యను కూల్ చేయటానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటారు. మిగిలిన ప్రయత్నాల మాట ఓకే. కానీ.. ముద్దు ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయకండి. తాజాగా అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయి.. ఆసుపత్రిలో చేరిన భర్త ఉదంతం ఇది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ఔటర్ ఢిల్లీలోని రణహోలా ప్రాంతానికి చెందిన కరణ్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. అయితే.. ఇరువురి మధ్య గొడవలు ఉన్నాయి. పెళ్లి జరిగిన రెండేళ్లు అవుతున్నా.. ఇరువురి మధ్య ఏదో కారణం మీద పోట్లాటలు జరుగుతుండేవి. ఇదిలా ఉంటే.. తాజాగా భార్యభర్తలు ఇద్దరు గొడవపడ్డారు.
భార్య కోపాన్ని తగ్గించేందుకు వీలుగా భర్త కరణ్ ఆమె దగ్గరకు వచ్చి ముద్దిచ్చారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న భార్య.. కరణ్ ఉద్దేశాన్ని పట్టించుకోకుండా.. అదే అదునుగా భావించి అతడి నాలుకను కొరికేసింది. ఆమె ఎంత కోపంగా ఉందంటే.. ఆమె కొరికిన తీరుతో కరణ్ నాలుక తెగిపోయింది.దీంతో అతడ్ని హుటాహుటిన సఫ్టర్ జంగ్ ఆసుపత్రిలో చేర్చారు.
వెంటనే కరణ్ నాలుకకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. తాజా పరిణామం తర్వాత కరణ్ కు మాటలు రాని పరిస్థితి. భర్త నాలుకను కొరికిన వైనంపై నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవలు అంతకంతకూ ఎక్కువై.. కలిసి ఉండటం కుదరదని అనుకుంటే వేర్వేరుగా ఉండాలే కానీ.. ఈ రకంగా కొరికేస్తారా? అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.