Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఆకతాయిలు...
By: Tupaki Desk | 1 Aug 2015 10:08 AM GMTరాత్రిపూట బైక్ లు కార్లు ఇంట్లో పెట్టుకుని వాటిపై ఒక కవర్ వేసుకుని, అలసిపోయి నిద్రలోకి జారుకుంటాం. ఉదయం లేచి పనులు పూర్తిచేసుకుని ఆఫీసులకు బయలుదేరతాం! ఆ సమయంలో మనం రాత్రిపూట ఎంతో సేఫ్ గా దాచిపెట్టాం అనుకున్న మన వాహనం ఉదయానికి ధ్వంసం అయితే... బైకుకు డూం లు, కార్లకు అద్దాలు పగిలిపోతే!
తాజాగా హైదరాబాద్ లోని చైతన్య పురిలో ఇదే బీభత్సం జరిగింది! చైతన్య పురిత్లోని ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడులు చేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ రచ్చలో సుమారు 18 కార్లు, ఎన్నో బైకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి! ఇదే సమయంలో దిల్ సుఖ్ నగర్ పరిధిలోని కోదండరాం నగర్, పీ అండ్ టీ కాలనీ, శారదా నగర్ లలో ఇలానే మరికొన్ని వాహనాలపై దుండగులు ఈ దృశ్చర్యకు పాల్పడ్డారు!
బాదితులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశ్తున్నారు. దీనికోసం కాలనీల్లోని సీసీటీవీల ఫుటేజిలను పరిశీలిస్తున్నారు! అయితే పోలీసు పెట్రోలింగ్ లేకపోవడం అనేదే దీనికి పూర్తి కారణం అని స్థానికుల ఆరోపణ! ఇది కేవలం తాగి అల్లరిచేసే అలవాటున్న అల్లరిమూకల వికృత చేష్టగానే పలువురు భావిస్తున్నారు!