Begin typing your search above and press return to search.
దారుణం ... ఆన్‌లైన్ క్లాసులకూ యూనిఫాం !
By: Tupaki Desk | 16 April 2020 2:30 PM GMTప్రైవేట్ విద్యాసంస్థల ఆలోచనలు ఎలా ఉంటాయో మరోసారి అందరికి కళ్లకి కట్టినట్టు కనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ అంటేనే ...విద్యతో వ్యాపారం చేసే సంస్థలు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి ..ఎలా ముందుకు పోవాలి అనే ఆలోచన లేకుండా కొన్ని సంస్థలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయి. అనుకోకుండా వచ్చి పడిన ఈ ముప్పుతో ప్రస్తుతం విద్యాసంస్థలు అన్ని కూడా మూసేశారు. దీనితో గత 20 రోజులుగా విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు.
ఈ తరుణంలో తమ స్కూల్ లో చదువుతున్న పిల్లలు తరగతుల్లో వెనకబడి పోవద్దనే భావనతో కొన్ని యాజమాన్యాలు కొద్ది రోజులుగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇది మంచిదే. కానీ మరికొందరు మాత్రం ఏకంగా ఆన్ లైన్ లో క్లాస్ లు వినడానికి కూడా బడిలో మాదిరిగా ఇంటిలో కూడా స్కూల్ యూనిఫాం, షూస్ ధరించి తరగతులకు హాజరు కావాలని, సాయంత్రం వరకు వీడియోల ద్వారా కనిపించాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. దీనితో ప్రైవేట్ విద్యాసంస్థల పై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
శవ్యాప్త లాక్ డౌన్ తో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో హైదరాబాద్ లోని 60శాతం ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ తరగతులకు శ్రీకారం చుట్టాయి. ఉదయం 9.30 గంటలకు వీడియో కాల్‌లో ప్రార్థన, 11.00 గంటలకు ఇంటర్‌వెల్, 1 గంటకు లంచ్ బ్రేక్ ఇస్తున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటలకు మళ్లీ ఆన్ లైన్ పాఠాలు కొనసాగిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే మరికొంతమంది వాట్సాప్ ద్వారా పాఠాలు చెప్తున్నారు.
మరికొందరు స్కూల్‌లోని తరగతి గది బోర్డుపై లెక్కలు, గ్రామర్, సైన్స్ పాఠాలు చెబుతూ వీడియో కాల్స్ ద్వారా వాటిని వినాలని, పరీక్షలకు సిద్ధం కావాలని చెబుతున్నారు. ఇంట్లో ఉండే పిల్లలకి చదువు చెప్పడం మంచిదే అయినా కూడా ఎదో స్కూల్ లో చెప్పినట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు అదే పనిగా చెప్పడం , ఇళ్లల్లోకూడా స్కూల్ యూనిఫాం ధరించాలని చెప్పడం మరీ దారుణం అంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. అలాగే మరికొందరు అయితే , ఫీజుల కోసమే ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు..