Begin typing your search above and press return to search.

యూనియన్ బడ్జెట్ 2017-18

By:  Tupaki Desk   |   1 Feb 2017 10:52 AM GMT
యూనియన్ బడ్జెట్ 2017-18
X
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి ఎంపీ అహ్మద్ మృతి చెందడంతో బడ్జెట్ ను ఒక రోజు వాయిదా వేయాలని విపక్షాలు పట్టుబట్టినా.. జైట్లీ మాత్రం షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. విపక్షాలు ఆందోళనల మధ్యే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. తొలిసారిగా సాధారణ బడ్జెట్ లోనే రైల్వేకు కూడా నిధులు కేటాయించనున్నారు. ఇక ఈసారి ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలంటూ విభజన కూడా ఉండదు. తుపాకి బడ్జెట్ విశేషాలను.. ఇదే వార్తలో పాయింట్ల వారీగా సరళంగా అందిస్తుంది.

బ‌డ్జెట్ ప్రారంభం సంద‌ర్భంగా జైట్లీ ఈ విధంగా ప్ర‌సంగించారు.

-వసంత పంచమి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరం.

-బ్లాక్ మనీపై పోరాటం చేశాం.. దానికి ప్రజల మద్దతు పలికారు. ప్రజా ధనానికి మేం సంరక్షకులం

- రెండంకెల ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశం ఉంది.ద్రవ్యోల్బణం తగ్గించగలిగాం.. జీడీపీ పెంచగలిగాం.

- పరిపాలన పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నించాం

- యువశక్తి ఆకాంక్షలు నెరవేర్చేలా మా బడ్జెట్ ఉంటుంది.

-ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అనిశ్చితిలో ఉంది. అయినా భార‌త్ అన్నిరంగాల్లో ప్ర‌గ‌తి సాధించింది.

- 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి

-నల్లధనం - అవినీతి - నకిలీ నోట్లపై యుద్ధంలో భాగంగానే నోట్ల రద్దు. నోట్ల రద్దు అన్ని రకాలుగా మేలు చేసింది.

- ఉద్యోగ - ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి.

- సంప్రదాయాల పేరు చెప్పి వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి పలికాం.

- త‌ద్వారా విదేశీ పెట్టుబ‌డులు భారీగా త‌ర‌లివ‌స్తున్నాయి. 361 బిలియ‌న్ డాల‌ర్లు విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు చేరాయి. ఇది ఏడాది దిగుమతులకు సమానం.

- భారత్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది.

- 2017-18లో జీడీపీ 7.6 శాతంగా - 2018-19లో జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా.

- ప్రధానంగా పది రంగాలపై దృష్టి సారించి ఈ బడ్జెట్ ను రూపొందించాం. 1.రైతులు - 2. రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ ఇన్ ఫ్రా - 3. యువతకు నైపుణ్య శిక్షణ - ఉద్యోగాలు - 4. భద్రత - 5. మౌలిక సదుపాయాలు - 6. ఆర్థిక రంగ పటిష్టత - 7. డిజిటల్ ఎకానమీ - 8. పబ్లిక్ ఎఫిషియెన్సీ సంస్కరణలు - 9. ఆర్థిక క్రమశిక్షణ - 10 పన్నుల్లో స్థిరత్వ సాధన.

- రైతులకు ఈ సారి రికార్డు స్థాయిలో 10 లక్షల కోట్లు రుణాలు ఇస్తాం. వారి ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేస్తాం.

- కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో మినీ ల్యాబ్ ల ఏర్పాటు. మట్టి నాణ్యత కార్డులు ఇక వేగంగా జారీ.

- రైతుల‌కు భ‌రోసా ఇవ్వ‌డంలో భాగంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేందుకు పంటల బీమా యోజన

- పంటల బీమా యోజన కింద మరో 40 శాతం కవరేజ్ పెంపు. సాగునీటి సౌకర్యం కోసం రూ. 40 వేల కోట్లతో కార్పస్ ఫండ్

- ఈనామ్ లు 240 నుంచి 500లకు పెంపు.

- వ్యవసాయం కోసం ఉపాధి హామీ పథకం నిధులు

- ఉపాధి హామీ పథకానికి 48 వేల కోట్లు కేటాయింపు

-2019 నాటికి 50 వేల గ్రామ పంచాయతీలు పేదరికం నుంచి బయటపడుతాయి.

- వ్యవసాయ - గ్రామీణ అభివృద్ధి రంగాలకు లక్షా ఎనభై ఏడు వేల కోట్లు కేటాయింపు.

వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు లక్షా ఎనభై ఏడు వేల కోట్లు కేటాయింపు. ఆ నిధులను..

-ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,100 కోట్లు. అంటే గ్రామీణ రోడ్లు మెరుగవుతాయి.

-ప్రధాని ఆవాస్ యోజనకు రూ. 23 వేల కోట్లు. పేదలకు గృహాలు కట్టిస్తారు.

- గ్రామజ్యోతి యోజనకు రూ. 4,300 కోట్లు. గ్రామాలు మెరుగుపడతాయి.

- అంత్యోదయ యోజనకు రూ. 2,500 కోట్లు

- జాతీయ ఉపాధి హామీ పథకంలో మహిళలను కచ్చితంగా తీసుకోవాలని రూల్.

- 2019 నాటికి పేదలకు కోటి ఇండ్ల నిర్మాణం ద్వారా ప్రతి పేదోడికి ఇంటి లక్ష్యం నిర్దేశించుకున్నారు.

విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం

- రూ. 4 వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధి సంకల్ప నిధి ఏర్పాటు

- దేశంలో విద్యారంగం కోసం ప్రత్యేక డీటీహెచ్ ఛానెల్ ఏర్పాటు.

- ప్రధాని మంత్రి కౌశల్ యోజన దేశంలోని 600 జిల్లాలకు విస్తర‌ణ‌. ఇది నైపుణ్య శిక్షణ పథకం.

- దేశ వ్యాప్తంగా 100 'ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్స్' ఏర్పాటు చేసి నిపుణులైన మాన‌వ వ‌న‌రుల‌ను తీర్చిదిద్దుతాం

- విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్‌ లైన్‌ క్లాసులు.

- నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల అనుసంధానం

- సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ కోసం ఫండ్ ఏర్పాటు.

- రైల్వే బ‌డ్జెట్‌ను సాధార‌ణ బ‌డ్జెట్‌లో క‌లిపివేశాం. అయిన‌ప్ప‌టికీ రైల్వేల స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి కొన‌సాగుతుంది.

- రూ. 1.31 లక్షల కోట్లు రైల్వేలకు కేటాయింపు

-భద్రతకు పెద్దపీట వేస్తూ లక్ష కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు.

- -రైల్వే బడ్జెట్ రూ. లక్షా 31 వేల కోట్లు, 55 వేల కోట్ల ప్రభుత్వ సాయం

- కొత్తగా మెట్రో రైలు పాలసీ.

- ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సేవా పన్ను రద్దు.

- కొత్త టూరిస్ట్ రైలు.

- 2017-18లో 25 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ

- ఐదు వందల స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు.

- 2000 స్టేషన్లలో సోలార్ పవర్

- 2019 నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్స్.

- దేశీయ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైలు విధానం

- మెట్రో రైలు మార్గాల ఏర్పాటులో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట

మ‌హిళల‌కు పెద్ద పీట‌

-మహిళా శిశు అభివృద్ధి కోసం 1.84 లక్షల కోట్లు కేటాయింపు

-మహిళా సాధికారత కోసం రూ. 500 కోట్లతో మహిళా శక్తి కేంద్రాలు

-గర్భిణీలకు ఆస్పత్రి ఖర్చులకు రూ. 6 వేలు నగదు బదిలీ

-2025 కల్లా టీబీ రహిత దేశం చేయడం లక్ష్యం

-దేశంలో వెనుకబాటును పోగొట్టే లక్ష్యంతో రూ. 52,393 కోట్లు కేటాయింపు.

- గిరిజనులకు రూ. 31,920 కోట్లు, మైనార్టీలకు రూ. 4,195 కోట్లు.
...

ఆర్థిక రంగం

-సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ

-సంకల్ప్ కార్యక్రమం ద్వారా 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ

-ముద్రా రుణాల కోసం రూ. 2 లక్షల 44 వేల కోట్లు

-250 ఎలక్ర్టానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు

-ఎలక్ర్టానిక్ ఉత్పాదక కేంద్రాల కోసం రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి

-20 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు

-బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ కోసం రూ. 10 వేల కోట్లు

-ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేసేందుకు విలువ నిర్ధారణ కమిటీ ఏర్పాటు

-త్వరలో ఆధార్ అనుసంధానిత చెల్లింపుల వ్యవస్థ

-500 కోట్ల మంది నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం

-కోటి 25 లక్షల మంది బీమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు

-బీమ్ యాప్ ప్రోత్సాహం కోసం రెండు కొత్త పథకాలు

- ప్రతి ఊరికి కరెంటు.

-అన్ని గ్రామాలకు తారు రోడ్లు

-ఉపాధి హామీ పథకంలో మహిళలకు రిజర్వేషన్

-బడ్జెట్ నిధుల కేటాయింపులో రూరల్ ఫస్ట్ ప్లేస్.

-ఇండియా ప్రపంచంలో అతిపెద్ద 6వ మాన్యు ఫాక్చరింగ్ కంపెనీ

-అన్ని ప్రాంతాల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో సాయిల్ టెస్టింగ్ సెంటర్స్.

-కౌలు రైతులకు కొత్త చట్టం, నిబంధనలు.

-ఫ్లోరైడ్ ఏరియాలో ప్రత్యేక మంచి నీటి పథకం.

-600 స్కిల్ సెంటర్లు, 100 ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్స్. సంకల్ప్ కార్యక్రమం ద్వారా 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ

-సీనియర్ సిటిజన్స్ కు ఆధార్ బేస్డ్ హెల్త్ కార్డ్స్.

-భీమ్ యాప్ .. వచ్చే బడ్జెట్ నాటికి లక్షల కోట్ల ట్రాన్షాక్షన్ల స్థాయికి చేరుకుంటుంది.

-కేవలం 24 లక్షల మంది మాత్రమే పది లక్షలు దాటి ఆదాయం చూపిస్తున్నారు.

-రాష్ర్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 4.11 లక్షల కోట్లు

-రక్షణ రంగానికి రూ. 2 లక్షల 74 వేల కోట్లు

-శాస్ర్త సాంకేతిక రంగానికి రూ. 34,435 కోట్లు

-వార్షిక వ్యయ ప్రణాళిక రూ. 21.47 లక్షల కోట్లు

-ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం ఉండొచ్చు

-వచ్చే ఏడాది ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేస్తాం

-వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు 1.9 శాతం

-రైల్వే బడ్జెట్ రూ. లక్షా 31 వేల కోట్లు

ఐటీ వివ‌రాలు

రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కొత్త నిబంధనలు తీసుకువస్తాం

-ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారి సంఖ్య 1.81 కోట్లు

-దేశంలో వ్యక్తిగతంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య 1.74 కోట్లు

-4.2 కోట్ల మంది వేతన సిబ్బంది ఉన్నారు

-దేశంలో 50 లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నామని చెప్పిన వారి సంఖ్య 1.72 లక్షలు మాత్రమే

-దేశంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న కంపెనీలు 5.97 లక్షలు

-ఆదాయం రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నారు 1.95 లక్షల మంది

-రూ. 10 లక్షల ఆదాయం చూపిస్తున్నవారి సంఖ్య 20 లక్షల లోపే

-రూ. 2.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 99 లక్షల మంది

-24 లక్షల మంది రూ. 10 లక్షలపై ఆదాయాన్ని చూపిస్తున్నారు

-1.2 లక్షల మంది రూ. 50 లక్షల ఆదాయాన్ని చూపిస్తున్నారు

-నోట్ల రద్దు తర్వాత పన్నుల రాబడి34 శాతం పెరిగింది


పోస్టాఫీసుల ద్వారా పాస్ పోర్టుల జారీ


-విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన‌ ఎఫ్‌ఐపీబీ విధానం రద్దు

- న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా బ్యాంకులు 10 లక్ష‌ల‌ పీఓఎస్‌లను సమకూర్చ‌నున్నాయి.

- ఇక‌నుంచి పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు జారీ

-సీనియర్‌ సిటిజన్ల హెల్త్‌ రికార్డు ఆధార్‌ తో అనుసందానం

-లక్షన్నర ఆరోగ్య కేంద్రాలు వెల్‌ నెస్‌ సెంటర్లుగా మార్పు

-గర్భిణీలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 6 వేల నగదు బదిలీ

- భవిష్యత్తులో మరింతగా తగ్గనున్న గృహ రుణ వడ్డీ

- గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా

- గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ. 20 వేల కోట్ల రుణం

-మిషన్‌ అంత్యోదయ కింద కోటి ఇళ్ల నిర్మాణం

-వృద్ధులకు ఆధార్ కార్డే ఆరోగ్య కార్డు

-సామాన్యులకు ప్రయోజనాలను దగ్గర చేసేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ

- పెట్రోలు బంకులు, ఆసుపత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు మరింత ప్రోత్సాహం

-జనరిక్ ఔషధాల వినియోగానికి ప్రత్యేక విధానం

- పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు

-ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు పెద్దపీట

-ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళితే కఠిన చర్యలు

-బ్యాంక్ డీఫాల్టర్ల ఆస్తుల జప్తు కోసం కొత్త చట్టం

-2019 నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్‌ కోచ్‌ లు

-పర్యాటకుల కోసం ఇకపై ప్రత్యేక రైళ్లు

-2020 నాటికి కాపలాలేని రైల్వేక్రాసింగ్‌లు ఉండవు

-ఐఆర్‌సీటీసీ ఈ-టికెట్లపై సర్వీస్‌ ఛార్జ్‌ తొలగింపు

-గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ కోసం రూ.10 వేల కోట్లు

- రాజకీయ పార్టీలకు చెక్కులు లేదా డిజిటల్‌ పద్ధతిలోనే విరాళాలు ఇవ్వాలి

- విరాళాలు 20 వేల రూపాయిలకు మించితే తప్పనిసరిగా లెక్క చెప్పాలి

- సీనియర్ సిటిజన్లకు 8 శాతం గ్యారంటీతో ఎల్ఐసీ కొత్త పథకం

-అమరావతిలో భూములిచ్చిన రైతులకు మూలధన పన్ను మినహాయింపు

-స్టార్టప్‌ కంపెనీలకు మరింత ప్రోత్సాహం, ఎల్‌ఎన్‌జీపై కస్టమ్స్‌ తగ్గింపు