Begin typing your search above and press return to search.
బడ్జెట్ పై మోడీ మార్క్ ముద్రలు
By: Tupaki Desk | 22 Aug 2016 5:30 PM GMTపాలనా పరంగా విప్లవాత్మకమైన మార్పుల దిశగా ప్రధాని మోడీ ప్రయాణం షురూ చేస్తున్నట్లుగా ఉంది. దశాబ్దాల తరబడి సాగుతున్న విధానాల్ని మారపులు చేయాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న రైల్వే బడ్జెట్ కు చెల్లుచీటీ చెప్పాలన్న నిర్ణయాన్ని తీసుకున్న మోడీ సర్కారు తాజాగా వార్షిక బడ్జెట్ విషయంలోనూ అలాంటి నిర్ణయాల్నేతీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటివరకూ రైల్వే బడ్జెట్ ను.. వార్షిక బడ్జెట్ ను వేర్వేరుగా ప్రవేశ పెట్టేవారు. ఇప్పుడా విధానానికి స్వస్తి పలకాలన్న నిర్ణయం తీసుకున్న మోడీ సర్కారు.. ఇక వార్షిక బడ్జెట్ లోనూ కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 92 ఏళ్లుగా సాగుతున్న విధానాన్ని మార్చేందుకు మోడీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ ఫిబ్రవరిలో బడ్జెట్ ను సభకు సమర్పించే విధానం ఉంది. ఈ విధానానికి గుడ్ బై చెబుతూ.. జనవరి 31న వార్షిక బడ్జెట్ ను సమర్పించాలన్న దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
ఎందుకిలా అంటే.. దానికి ప్రభుత్వ వర్గాల సమాధానం ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడున్న విధానంలో ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టే బడ్జెట్.. మార్చి 31 తర్వాత చర్చలు జరిపి.. మే చివరి నాటికి బడ్జెట్ కు ఆమోదం పలుకుతున్నారు. దీంతో కొత్త బడ్జెట్ అమల్లోకి రావటానికి దాదాపు రెండు నెలలకు పైనే వెయిట్ చేయాల్సి వస్తోంది. మార్చి 31 తర్వా ఓటాన్ అకౌంట్ తో నడిపించేస్తున్నారు.
దీనికి భిన్నంగా జనవరి 31 నాటికి బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టి.. మార్చి31 నాటికి బడ్జెట్ చర్చను పూర్తి చేసి..కొత్త బడ్జెట్ ను కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ రోజు నుంచే అమల్లోకి వచ్చేలా చేయాలన్నది మోడీ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును కేంద్రం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. తాజాగా తెర మీదకు వచ్చిన మార్పుల కారణంగా నవంబరు లేదంటే డిసెంబరు నెలల్లో జరిపే బడ్జెట్ ముందస్తు భేటీల్ని సెప్టెంబరులోనే పూర్తి చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. వీటితో పాటు బడ్జెట్ కు సంబంధించిన మరికొన్ని మార్పులు చేయాలని మోడీ సర్కారు భావిస్తోంది. చూస్తుంటే.. వచ్చే వార్షిక బడ్జెట్ మొత్తం మోడీ ముద్ర స్పష్టంగా కనిపించేలా కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది.