Begin typing your search above and press return to search.
ట్రిపుల్ తలాక్..కేంద్రం కీలక నిర్ణయం
By: Tupaki Desk | 15 Dec 2017 1:02 PM GMTముస్లిం మహిళల రక్షణ కోసం తీసుకువస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ పై చట్టాన్ని రూపొందిస్తారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం భర్తలు మూడు సార్లు తలాక్ అని చెబితే.. అప్పుడు విడాకులు జరిగినట్లే. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే - అప్పుడు మహిళలకు మరింత రక్షణ ఏర్పడే అవకాశాలున్నాయి. ట్రిపుల్ తలాక్ కేసు కింద మహిళలు మెయింటెనెన్స్ తీసుకునే ఛాన్సుంది.
ట్రిపుల్ తలాక్ సాంప్రదాయం ఓ హత్య లాంటిందని ఇవాళ ఉదయం బీజేపీ మంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే అనేక ముస్లిం సంఘాలు - రాజకీయ నాయకులు ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. హిందువు సోదరిలను విస్మరించి ముస్లింల హక్కుల గురించి ప్రధాని మోడీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ప్రధానమంత్రిగా తన భార్యకే న్యాయం చేయలేనివాడు ముస్లిం యువతులకు న్యాయం చేస్తానంటూ రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. మొదట తన భార్యతో కలిసి కాపురం చేసి త్రిపుల్ తలాక్ పై మాట్లాడాలని హితవు పలికారు.
ఇటీవల తలాక్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలో పాల్గొన్న ఓ ముస్లిం మహిళకు తన భర్త విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటు చేసుకుంది. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ శనివారం నిర్వహించిన ర్యాలీలో ఫయ్‌రా అనే ముస్లిం మహిళ పాల్గొంది. త్రిపుల్ తలాఖ్ పై చట్టం చేస్తామని మోడీ చెబుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నట్లు ఫయ్ రా తెలిపింది.