Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రివర్గవిస్తరణ.. ఏపీ నుంచి ఇతడే?
By: Tupaki Desk | 4 Oct 2019 6:45 AM GMTమోడీ వందరోజుల పాలన పూర్తయ్యింది. దూకుడుగా ముందుకెళుతున్నారు. లోటుపాట్లు తెలిసివచ్చాయి. పనిచేయని కేబినెట్ మంత్రులు ఎవరో.. చేస్తున్నదెవరో తేలిపోయింది. అంతేకాదు.. ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న మంత్రులకు అవి భారమవుతున్నాయని తేలింది. దీంతో ఈ నెల మూడో వారంలోనే మోడీ తన కేబినెట్ ను విస్తరిస్తున్నారని ఢిల్లీలో టాక్ వినిపిస్తోంది.
రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనను గాడిలో పెట్టి సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే సమీక్ష తర్వాత మోడీ పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యాడట.. ఇక మోడీ కేబినెట్ లో ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న సృతీఈరానీ - నరేంద్రసింగ్ తోమర్ - రవిశంకర్ ప్రసాద్ - హర్షవర్ధన్ - ప్రకాష్ జవదేకర్ - పీయూష్ గోయల్ - ధర్మేంద్ర ప్రధాన్ - ప్రహ్లాద్ జోషి ల వద్దున్న ఎక్కువ శాఖలను కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకొని వారికి అప్పగించాలని యోచిస్తున్నారట..
ఇక ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సురేష్ ప్రభుకు సమర్థుడిగా పేరుంది. ఆయన గతంలో వాణిజ్య - పరిశ్రమలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇటీవల జీ20 సమావేశంలోనూ భారత్ తరుఫున షేర్పాగా ప్రభుత్వ ప్రతినిధి పాత్ర ను బాగా నిర్వహించారని స్వయంగా ప్రధాని మెచ్చుకున్నారట.. అందుకే ఇప్పుడు సురేష్ ప్రభును మంత్రివర్గంలోకి తీసుకొని పీయూష్ గోయల్ వద్దనున్న రైల్వే - వాణిజ్య - పరిశ్రమల్లో శాఖల్లో వాణిజ్య - పరిశ్రమలను సురేష్ ప్రభుకు ఇవ్వాలని మోడీ యోచిస్తున్నట్టు తెలిసింది.
ఇక మోడీ కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఆ రాష్ట్రం కోటాలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తెలుగు వ్యక్తి రాంమాధవ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని మోడీ డిసైడ్ అయినట్లు తెలిసింది. వీరే కాక.. ఆర్థిక మందగమనం దృష్ట్యా కేబినెట్లోకి కొందరు నిపుణులు - ప్రతిభావంతులైన మాజీ అధికారులను కూడా తీసుకునే అంశాన్ని మోడీ పరిశీలిస్తున్నట్టు సమాచారం.