Begin typing your search above and press return to search.

కరోనాను లైట్ తీసుకునేటోళ్లు.. ఆయన మాట వింటే మంచిది

By:  Tupaki Desk   |   3 April 2021 4:17 AM GMT
కరోనాను లైట్ తీసుకునేటోళ్లు.. ఆయన మాట వింటే మంచిది
X
నెల క్రితం కూడా ఫర్లేదనుకున్న కరోనా మహమ్మారి ఇప్పుడు.. వేగంగా విస్తరిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్నకేసులతో ఆయా రాష్ట్రాలే కాదు.. కేంద్రం సైతం ఇప్పుడు వణుకుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొత్త కేసుల్ని నివారించే విషయాన్ని తగ్గించలేని పరిస్థితి.ఇలాంటివేళ.. ఢిల్లీలోని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా హైలెవల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు.

ఈ రివ్యూ మీటింగ్ ప్రత్యేకత ఏమంటే..దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎస్ లు.. డీజీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గుండెలు అదిరే విషయాన్ని చెప్పారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు ఉన్నట్లుగా బాంబు పేల్చారు. గడిచిన పద్నాలుగు రోజుల్లో ఈ పదకొండు రాష్ట్రాల నుంచే తొంభై శాతం కేసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు.

తొలి దశతో పోలిస్తే.. ఈసారి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగినట్లుగా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. మహారాష్ట్ర విషయంలో తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. కోవిడ్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న అన్ని వనరుల్ని ఉపయోగించాలని.. ఆరోగ్య శాఖతో పాటు.. అన్నిశాఖలు ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. కరోనాను లైట్ తీసుకునే వారంతా.. ఇప్పుడు వినాల్సిన కీలకమైన మాటగా దీన్ని చెప్పాలి.