Begin typing your search above and press return to search.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టతనిచ్చిన నిర్మల
By: Tupaki Desk | 7 Feb 2021 4:05 PM GMTవిశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ పరిశ్రమ పెట్టుబడుల ఉపసంహరణ గురించి మరింత స్పష్టతనిచ్చారు.
ముంబైలో మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ పెట్టుబడుల ఉపసంహరణ చాలా బాధ్యతాయుతంగా.. పారదర్శకంగా బహిరంగ ప్రక్రియ ద్వారా జరుగుతోందన్నారు. నచ్చినట్లు ఎంపిక చేసిన సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించే ప్రయత్నాలు చేయడం లేదని నిర్మల క్లారిటీ ఇచ్చారు.
పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకోవడానికి ముందు విస్తృత సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుందని నిర్మల తెలిపారు. ప్రతీ దశలోనూ తనిఖీలు జరుగుతాయని తెలిపారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఆంధ్రా అట్టుడుకుతోంది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణపై కుండబద్దలు కొట్టడం సంచలనంగా మారింది. ఆంధ్ర కోడలు ఇలా ప్రకటించడం ఏపీ నిరసనకారులను నిరాశకు గురిచేస్తోంది.