Begin typing your search above and press return to search.

'నిర్మ‌ల‌మ్మ లెక్క త‌ప్పింది.. జ‌గ‌న్ లెక్క స‌రిపోయింది..!!

By:  Tupaki Desk   |   26 July 2022 9:30 AM GMT
నిర్మ‌ల‌మ్మ లెక్క త‌ప్పింది.. జ‌గ‌న్ లెక్క స‌రిపోయింది..!!
X
అదేంటో.. లెక్క‌ల్లో ప‌క్కాగా ఉంటూ.. ఒక్క‌రూపాయిని కూడా వ‌దులుకోని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల మ్మ లెక్క‌లు త‌డ‌బ‌డ్డాయి. ఆది నుంచి ఏపీపై నిప్పులు చెరిగిన అప్పులు లెక్క‌లు..ఒక్క‌సారిగా.. త‌ప్పిపోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అప్పుల్లో ఏపీ ముందుంద‌ని చెప్పుకొంటూ వ‌చ్చిన నిర్మ‌ల‌మ్మ‌.. ఒక్క‌సారిటీ స్టంగ్‌.. అదే టంగు మార్చేశారు. ఏపీ అప్పుల్లో లేద‌న్న‌ట్టు చెప్పేశారు. వాస్త‌వానికి అప్పులు ఎక్కువ చేస్తున్న రాష్ట్రం ఏపీనేన‌ని.. ఇంకేముంది.. ఏపీ శ్రీలంక‌ అయిపోతోంద‌ని కేంద్రం పెద్ద‌లు ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు.

దీంతో ఏపీలో సీఎం జ‌గ‌న్‌కు సెగ‌త‌గులుతోంద‌ని.. కేంద్రం నుంచి ఇక‌, మొండి చేయేన‌ని అంద‌రూ లెక్క‌లు వేసుకుని.. విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, విప‌క్షాలు అయితే.. మ‌రింత రెచ్చిపోయాయి. అయితే.. ఆక‌స్మికంగా.. ఉరుములు లేని వ‌ర్షం మాదిరిగా.. లెక్క‌లు త‌ప్పిపోయాయి. అబ్బే.. మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే.. ఏపీ చేస్తున్న‌ది నామ‌మాత్ర‌మేన‌న్న‌ట్టుగా నిర్మ‌ల‌మ్మ తాజా ప‌ద్దు ప్ర‌క‌టించి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. దీంతో జ‌గ‌న్ లెక్క స‌రిపోయింద‌నేటాక్ వినిపిస్తోంది.

2021–22 బడ్జెట్ల అధ్యయనం’ పేరుతో రిజర్వు బ్యాంక్‌ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం బకాయిల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులకు సంబంధించి 2020 మార్చి చివరి నాటికి రుణాలు, 2021 మార్చి సవరించిన అంచనాలు, 2022 మార్చి నాటికి బడ్జెట్‌ అంచనాలను పార్లమెంట్‌కు వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి చివరికి బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అప్పు రూ.3,98,903.6 కోట్లు కాగా తెలంగాణ మొత్తం అప్పు రూ.3,12,191.3 కోట్లుగా ఉందని తెలిపారు. అప్పుల్లో తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో నిలిచిందని నిర్మ‌ల‌మ్మ తాజా లెక్క‌లు వెల్ల‌డిస్తున్నాయి.

మ‌రి .. దీనిని ఎలా అర్దం చేసుకోవాల‌నేది రాష్ట్రంలోని ఆర్థిక మేధావుల మాట‌. ఎందుకంటే.. కేంద్రమే అటు.. ఏపీ అప్పులు చేస్తూ.. శ్రీలంక బాట‌లోకి వెళ్తోంద‌ని చెబుతున్న‌ది వారే. ఇప్పుడు అదే కేంద్రం ఏపీ ఎనిమిదో స్థానంలో ఉంద‌ని అంటున్నారు. మ‌రి దీనిలో ఏది నిజం. ఏదేమైనా.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తిచ్చిన `రుణాన్ని` ఇలా తీర్చుకుంటున్నారా? అనే సందేహాల‌ను ఆర్థిక నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు.

కార్పొరేష‌న్ అప్పులు దాచేశారా?

స‌రే..నిర్మ‌ల‌మ్మ చెప్పిందే క‌రెక్ట్ అనుకున్నా.. రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్పొరేష‌న్ ల‌ను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా అప్పులు చేసింద‌నేది.. నాలుగు రోజుల కింద‌.. ఆర్బీఐ హెచ్చ‌రించింది. ఈ అప్పుల‌ను దాచేస్తోంద‌ని కూడా బ్యాంకు పేర్కొంది. ఈ లెక్క సుమారు 1.2 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని.. తెలిపింది.

మ‌రి ఈలెక్క‌ల‌ను కూడా క‌లిపితే.. ఒక్క జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలోనే 4.32 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిన‌ట్టు ఇటీవ‌లే ఆర్బీఐ చెప్పింది. అప్పు ఎంత చేసినా..ఏ రూపంలో తెచ్చినా.. తీర్చాల్సింది అంతిమంగా ప్ర‌జ‌లే. కానీ, ఇప్పుడు ఈ లెక్క‌లు మార్చ‌డం ద్వారా నిర్మ‌ల‌మ్మ ఎవ‌రికి ప్ర‌యోజ‌నం చేస్తున్న‌ట్టు అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. జ‌గ‌న్‌కు ఈ లెక్క‌లు బాగానే స‌రిపోయిన‌ట్టు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.