Begin typing your search above and press return to search.
బాబు అలాంటి వారు కాదు..నమ్మండి ప్లీజ్..!
By: Tupaki Desk | 12 Jan 2023 1:30 AM GMTచంద్రబాబు విషయంపై బీజేపీ పెద్దలు ఇంకా ఒక క్లారిటీ రాలేకపోతున్నారనే వాదన ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇటీవల ఒక మాజీ కేంద్ర మంత్రి, పూర్వ టీడీపీ నాయకుడు, చంద్రబాబుకు చాలా దగ్గర సంబంధాలు ఉన్న పారిశ్రామికవేత్త ఒకరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకున్నారు. ఇది ప్రత్యేక అజెండాగా జరిగినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
ఈ సందర్భంగా బీజేపీకి ఆయన చంద్రబాబు పై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు చంద్రబా బుపై ఒకింత అనుమానంతో ఉన్నారు. అందుకే పొత్తు విషయంలో వారు తటపటాయిస్తున్నారనే వార్తలు ఏపీలో వినిపిస్తున్నాయి. వీటిపైనేసదరు మాజీ మంత్రి ఫోకస్ పెట్టి.. చంద్రబాబు వ్యక్తిత్వం గురించి వివరించినట్టు చెబుతున్నారు. చంద్రబాబు అలాంటి వారు కాదు.. నమ్మండి ప్లీజ్ అంటూ.. ఆయన వివరించారట.
ఎందుకంటే.. గత 2014లో మోడీ ప్రభుత్వంలో ఉండి.. మంత్రి పదవులు దక్కించుకున్న చంద్రబాబు.. అనూహ్యంగా ప్రత్యేక హోదాను వద్దన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి ఏడాదిన్నర ముందుగా.. తన వారితో రాజీనామా చేయించి.. మోడీ ఇంటిపైకి దండెత్తారు. మోడీకి వ్యతిరేకంగా మమతాబెనర్జీ (బెంగా ల్ సీఎం), కేజ్రీవాల్(ఢిల్లీ సీఎం)లతో జతకట్టారు. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు.
అదేసమయంలో మోడీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. ఈ పరిణామాలతో చంద్రబాబును ఎలా నమ్మాలనే విషయంపై బీజేపీ పెద్దలు ఇప్పటికీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే ఏపీలో టీడీపీతో పొత్తు విషయంలో వారు ముందుకు రాలేక పోతున్నారనే వాదన ఉంది. దీనిని పరిష్కరించే బాధ్యతను ఒకరాజ్యసభ సభ్యుడు సహా కేంద్రమాజీ మంత్రికి చంద్రబాబు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వారు.. కేంద్ర పెద్దను కలిసి.. చంద్రబాబు గురించి వివరించారని అంటున్నారు. చంద్రబాబు క్షణికావేశానికి లోనయ్యారని, మోడీపైనా.. బీజేపీపైనా ఆయనకు ఒక అబిప్రాయం ఉందని వివరించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని సానుకూలంగానే విన్న సదరు బీజేపీ పెద్ద.. ఇతర నేతలతోనూ చర్చించి చెబుతానని అన్నట్టుగా తెలిసింది. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.