Begin typing your search above and press return to search.

ఆలా చేయడం చాలా తప్పు ... అమిత్ షా ఫైర్ !

By:  Tupaki Desk   |   9 May 2020 3:01 PM GMT
ఆలా చేయడం చాలా తప్పు ... అమిత్ షా ఫైర్ !
X
కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశంలోని ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో దశ లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తూ ..కేంద్రం నిర్ణయం తీసుకున్న తరుణంలోనే లాక్ డౌన్ నుండి కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అలాగే వలస కార్మికులు వారి ఇంటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. వలస కార్మికుల కోసం ప్రత్యేక శ్రామిక రైళ్ల పేరుతొ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు తరలించే విషయమై పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం తగినంతగా సహకరించడం లేదని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. ఈ వలస జీవులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్లను మీ రాష్ట్రంలోకి అనుమతించకపోవడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేసాడు.

కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 2 లక్షల మందిని సొంత రాష్ట్రాలకు చేరుకునేలా కేంద్రం చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అమిత్‌ షా శనివారం లేఖ రాశారు. మీరిలాగే వ్యవహరిస్తే వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అమిత్ షా హెచ్చరించారు. కాగా కరోనా కేసులు, లాక్‌ డౌన్‌ తదితర అంశాల గురించి కేంద్రం, మమత ప్రభుత్వం తరచుగా మాటల యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదంటూ బీజేపీ నేతలు విమర్శలకు దిగగా.. తృణమూల్‌ నాయకులు అందుకు ధీటుగా బదులిచ్చారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ విషయంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపట్ల కూడా కేంద్రం… మమత ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఇటీవల ఆ రాష్ట్రాన్ని విజిట్ చేసిన కేంద్ర అంతర్ మంత్రివర్గ బృందాలకు దీదీ ప్రభుత్వం సరిగా సహకరించలేదు. ఇక తాజాగా లాక్ ‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరుణంలో బంగ్లాదేశ్‌ నుంచి సరుకు రవాణకు కేంద్రం అనుమతినివ్వగా.. ఆ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. తమ రాష్ట్రం నుంచి వాహనాలను పోనిచ్చేది లేదంటూ సీఎం మమత స్పష్టం చేసింది. దీనితో దీదీ పై అమిత్ షా ఫైర్ అయ్యారు.