Begin typing your search above and press return to search.
అమిత్ జీ.. మీరు ప్రతిపక్షంలో లేరు.. అధికారంలో ఉన్నారు!
By: Tupaki Desk | 15 May 2022 6:16 AM GMTకేంద్ర హోం మంత్రి, బీజేపీ నెంబర్-2 నాయకుడు.. అమిత్ షా తెలంగాణకు వచ్చారు. తుక్కుగూడలో పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా.. నిర్వహించిన సభలో అమిత్ షా సుదీర్ఘ ప్ర సంగం చేశారు. అయితే.. ఈ ప్రసంగానికి అనుకున్నంత మైలేజీ రాలేదని.. సొంత పార్టీలోనే నేతలు వ్యా ఖ్యానిస్తున్నారు. నిజానికి అమిత్‌షా పర్యటనపై రాష్ట్ర బీజేపీ నేతలు చాలానే ఆశలు పెట్టుకు న్నారు.. ఇంకేముంది.. భారీ ఎత్తున పంచ్‌లు పడతాయి..పార్టీ పుంజుకునేందుకు దిశానిర్దేశం చేస్తారని కూడా నాయకులు ఎదురు చూశారు.
కానీ, ఏనుగు సామెత మాదిరిగా అయిపోయిందట అమిత్ షా పర్యటన.. ప్రసంగం కూడా! అమిత్ షా మీ టింగ్ విన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు.. తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారని పార్టీ నేతలే చెప్పుకొం టున్నారు. అంతేకాదు.. ఎంతసేపు.. పాడిందే పాట అన్నట్టుగా... గతంలో రాసిన స్క్రిప్టునే ఆయన వల్లె వేశారని.. కార్యకర్తలు మాట్లాడుతున్నారు. అంతేకాదు.. కొత్తగా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేశామని... కానీ.. ఎక్కడా అలాంటి కొత్త వాసనలు తగలేదని.. పెదవి విరిచారు.
ఇక, ఈ సారి... అమిత్ షా మాట్లాడినప్పుడు.. ప్రజలకు.. ఆయన మాటలు కూడా కొన్ని కొన్ని చోట్లసరిగా అర్ధం కాలేదని అందకే.. చప్పట్లు కూడా కొట్టేలదని.. అన్నారు. ఇక, తన ప్రసంగంలో.. అమిత్ షా.. చాలా సార్లు.. ప్రజలకు కొన్ని ప్రశ్నలు సంధించి.. వాటికి సమాధానాలు చెప్పాలని కోరారు. అయితే.. ఆయన ఏం మాట్లాడుతున్నారో.. కూడా అర్ధం కాని ప్రజలు.. ఆయన అడిగిన ప్రశ్నలకు మౌనంగానే ఉన్నారట. ఇదే విషయాన్ని పార్టీలో కార్యకర్తలతో పాటు.. రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇక, అమిత్ షా తన ప్రసంగంలో చేసిన రాజకీయ విమర్శలపైనా.. విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి చేశారని.. అది కూడా పెద్ద ఎత్తున అవినీతి చేశారని.. ఇలాంటి అవినీతిని తాను ఎప్పుడు.. చూడలేదని.. అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఓకే.. ఇది నిజమే అనుకుందాం. అయితే.. కేంద్రంలో అధికారంలోఉన్నది అమిత్ షా పార్టీ బీజేపీనే కదా. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఈడీ.. సీబీఐ వంటి సంస్థలను ప్రయోగించలేదు? అనేది విశ్లేషకులు సంధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.
2019 ఎన్నికల్లో ఏపీలో ఇలానే అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై బీజేపీ నాయకులు... ముఖ్యం గా ప్రధాని హోదాలోనరేంద్ర మోడీనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పోలవరం ఒక ఏటీఎంగా మారిపోయిందని.. దానిని తన అవినీతికి అడ్డాగా మార్చుకున్నారని.. విమర్శలు చేశారు. తీరా.. చంద్రబాబు ప్రభుత్వం పోయి, జగన్ ప్రభుత్వం ఏర్పడింది. దీనిపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు(పోలవరంలో ఏమైనా అవినీతి జరిగిందా!) ఏమీలేదని.. ఇదే బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పింది.
ఇలానే...కేసీఆర్‌పైనా.. ఆయన ప్రభుత్వంపైనా.. అమిత్ షా బురద జల్లారు తప్ప.. దీనిలో ఎలాంటి విశే షం లేదని అంటున్నారు. ఇక, కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రంపై ఏవైనా వరాల జల్లులు కురిపిస్తారేమో.. అని అనుకున్నారు. అదేసమయంలో విభజన హామీలను ప్రస్తావించి.. వాటికి పరిష్కారం చూపిస్తారేమో నని కూడా భావించారు. కానీ, ఇలాంటి ముచ్చట్లు లేకుండా.. కేవలం విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చి.. ప్రసంగానికి చాప చుట్టేశారు. కనీసం ఒక్క ప్రాజక్టు కూడా ప్రకటించలేదు.
జాతీయ రహదారులు ఇచ్చాము.. స్కూళ్లను ఇచ్చాము.. ఇలా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేవాటినే తెలంగాణకు కూడా ఇచ్చి.. వాటినే గొప్పగా ప్రకటించుకున్నారు తప్ప..ప్రత్యేకంగా ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? అనేది ప్రశ్న. కానీ, ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఒక్క విషయాన్ని కూడా ప్రకటించలేదు. ఎంతసేపు రెచ్చగొట్టే మాటలు తప్ప.. ప్రజలకు మేలు చేసే మాటలు ఒక్కటి కూడా.. చెప్పలేదనేది సొంత పార్టీ నేతల ననుంచే వస్తున్న ప్రధాన విమర్శ. ఎందుకంటే..కేంద్రంలో అధికారంలో ఉన్నారు.. సో.. అధికారంలో ఉన్న పార్టీగా.. బలమైన నాయకత్వం ఉన్న పార్టీగా.. తెలంగాణ ప్రజలకు ఏదైనా చేయాలి కదా..! అనేది మేధావుల మాట.