Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి ఆగ్రహం.. ప్రోటోకాల్ లేదు.. మంత్రులు రారా?
By: Tupaki Desk | 14 Feb 2022 5:51 AM GMTఅంతా బాగున్నంత వరకు ఓకే. తేడా వస్తే మర్యాదల్ని మరచిపోవటం ఇటీవలి రాజకీయాల్లో కనిపించే కీలక పరిణామం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా తమ తఢాఖాను కేంద్రమంత్రికి రుచి చూపించారు. తాజాగా హైదరాబాద్ లో కేంద్ర అటవీ.. పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఒక సమీక్షను నిర్వహించారు.
ఈ రివ్యూ సమావేశానికి అధికారులు తప్పించి.. రాష్ట్ర మంత్రి హాజరు కాకపోవటంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరిగిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రి హాజరు కాలేదని.. కేవలం ఆ రాష్ట్ర అధికారులే రావటాన్ని తప్పుపట్టారు.
కేంద్రమంత్రిగా తాను వస్తే ప్రోటోకాల్ ను సైతం పాటించలేదన్న ఆయన.. 2021లో 141.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందన్నారు. ఇందుకు గాను రైతులకు రూ.26వేల కోట్లను కేంద్రం చెల్లించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. మోడీ చరిత్రలో అవినీతికి తావు లేదని స్పస్టం చేశారు. కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే.. ఆ బురద టీఆర్ఎస్ మీదనే పడుతుందన్నారు.తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో 2023నాటికి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.