Begin typing your search above and press return to search.

జర్నలిస్టుపై కేంద్రమంత్రి దాడి.. వేటు తప్పేలా లేదే?

By:  Tupaki Desk   |   16 Dec 2021 12:30 PM GMT
జర్నలిస్టుపై కేంద్రమంత్రి దాడి.. వేటు తప్పేలా లేదే?
X
లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని.. రైతులపై బీజేపీ నేతలు కావాలనే వాహనాలతో తొక్కించి చంపడానికి ప్లాన్ చేశారని సిట్ విచారణలో తేల్చింది. దీంతో బీజేపీపై, కేంద్రమంత్రి మిశ్రాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన కొడుకు ఈ కేసులో సూత్రధారిగా ఉన్నారు.

తాజాగా లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టం చేయడంతో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో తక్షణం ఢిల్లీ రావాలని ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

కొడుకు హత్య కేసులో ఇరుక్కోవడంపై తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి మిశ్రాను విలేకరులు ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన మిశ్రా మీడియాపై ఫైర్ అయ్యాడు. ‘మూర్ఖుడిలా ప్రశ్నలు అడగవద్దు.. మీరు మానసిక స్థితి కోల్పోయారా? ఏమీ తెలుసుకోవాలని అనుకుంటున్నారు? నిర్ధోషిని నిందితుడిగా మార్చారు. మీకు సిగ్గు లేదా? నీవు ఒక దొంగ’ అంటూ ఓ జర్నలిస్టుపై ఆగ్రహంతో కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు.
పలువురి గల్లా పట్టుకొని బెదిరించాడు. ఈ వీడియోలు బయటకు రావడంతో మరింత ఇరకాటంలో పడ్డారు.

దీంతో దీనిపై విపక్షాలు గోల చేయడం.. రాజీనామాకు డిమాండ్ చేయడంతో కేంద్రం స్పందించి వెంటనే ఢిల్లీకి రావాలని అజయ్ మిశ్రాను ఆదేశించింది. ఆయన పదవికే ఎసరు తెచ్చేలా ఈ వ్యవహారం మారింది.