Begin typing your search above and press return to search.

రాష్ట్ర మంత్రికి చెప్పులు అందించిన కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   27 Dec 2022 10:32 AM GMT
రాష్ట్ర మంత్రికి చెప్పులు అందించిన కేంద్ర మంత్రి
X
తన నియోజకవర్గంలో ప్రభుత్వం రోడ్లను బాగు చేయకపోవడంతో ఏకంగా మంత్రే శపథం చేశారు. తన నియోజకవర్గంలో రోడ్లు వేసే వరకు తాను చెప్పులు ధరించబోనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. దాదాపు రెండు నెలలపాటు చెప్పులు లేకుండానే పాడైన రోడ్లపైన తిరిగారు. ఎట్టకేలకు ప్రభుత్వం రోడ్లను బాగు నిధులు మంజూరు చేయడంతో ఆయన తన ప్రతిజ్ఞను విరమించారు. స్వయంగా కేంద్ర కేబినెట్‌ మంత్రే స్వయంగా చెప్పులు అందించడంతో వాటిని వేసుకున్నారు.

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తోమర్‌ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

అక్టోబర్‌ 20న మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ గ్వాలియర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్లను బాగు చేయాలని ప్రజలకు ఆయనకు విన్నవించారు. రోడ్ల దుస్థితిని పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి భీషణ ప్రతిజ్ఞ చేశారు. నియోజకవర్గంలో రోడ్లను బాగు చేయించేవరకు తాను చెప్పులు ధరించబోనన్నారు. దీంతో అక్టోబర్‌ 20 నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నారు.

గ్వాలియర్‌ నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రోడ్లు బాగుచేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రద్యుమన్‌ సింగ్‌ ఈ ఏడాది అక్టోబరు 20 నుంచి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతున్నారు. రోడ్ల మరమ్మతులు చేస్తేనే తాను చెప్పులు వేసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఇటీవలే రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో 56 రోజుల తర్వాత ఎట్టకేలకు ఆయన చెప్పులు ధరించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ఆయనకు కొత్త చెప్పులు అందించారు. ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్‌సింగ్‌ తోమర్‌కు కొత్త చెప్పులు ఇచ్చారు. దీంతో ఆ చెప్పులు తొడుక్కున్న అనంతరం జ్యోతిరాదిత్య పాదాలకు సింగ్‌ నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

'ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు. గెండెవాలి రోడ్డు, లక్ష్మణ్‌ తాళయ్య రోడ్డు, జయరోగ్య హాస్పిటల్, రాజపయగ రోడ్డు బాగు చేసే వరకు నేనూ రోజూ చెప్పుల్లేకుండానే ప్రజల బాధలు తెలుసుకుంటానని రెండు నెలల క్రితం హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్నాను' అని మంత్రి ప్రద్యుమన్‌ సింగ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.