Begin typing your search above and press return to search.

రాజమౌళి కోసం బీజేపీ.. ఫలితం ఏంటి.?

By:  Tupaki Desk   |   22 Jun 2018 10:46 AM GMT
రాజమౌళి కోసం బీజేపీ.. ఫలితం ఏంటి.?
X
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొత్త ప్లాన్ వేశారు. బీజేపీకి సినీ - క్రీడా గ్లామర్ జోడించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం మొదట ఆయన తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ను కలిశారు. మోడీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని.. వచ్చేసారి కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి మద్దతు పలకాలని అమిత్ షా కపిల్ దేవ్ కు విజ్ఞప్తి చేవారు.

ఇక తాజాగా అమిత్ షా సినీ రంగంపై పడ్డారు. బాలీవుడ్ సెలెబ్రెటీలు - స్పోర్ట్స్ సెలబ్రెటీలు - మాజీలు - సినిమా ప్రముఖులు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో ప్రాంతీయ సినిమాల ప్రముఖులను కూడా కలవాలని నిర్ణయించుకున్నారట.. ఇందులో భాగంగానే బాహుబలి లాంటి అద్భుత దృశ్యకావ్యాన్ని తీసిన ఎస్ ఎస్ రాజమౌళిని తాజాగా కేంద్రమంత్రి హన్స్ రాజ్ అహిర్ వచ్చి కలిశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా రాజమౌళిని - ఆయన తండ్రిని కలిసి సన్మానించారు.

బీజేపీకి మద్దతు తెలపాలని రాజమౌళిని హన్స్ రాజ్ కోరినట్టు తెలిసింది. అయితే రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని రాజమౌళి బీజేపీ ఆఫర్ ను మన్నిస్తాడా ..? మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు కోరిక మేరకు రాజధాని అమరావతి నిర్మాణ ప్లాన్ కు సలహాలు ఇచ్చిన రాజమౌళి.. మోడీతో వెళతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.