Begin typing your search above and press return to search.
ఆ ఘటనతో అమెరికా కంటే మనమే గొప్పని అనిపించింది: కేంద్ర మంత్రి కామెంట్స్ వైరల్!
By: Tupaki Desk | 17 Aug 2022 12:25 PM GMTకోవిడ్ 19 ఆంక్షలు ఉన్న సమయంలో తాను అమెరికాలో పర్యటించినప్పుడు ఎదురయిన ఘటన గురించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా మీడియాతో పంచుకున్నారు. తాను 2021లో అమెరికాలో పర్యటించానని.. ఆ సమయంలో తన కుమారుడుతో కలిసి రెస్టారెంటులో భోజనం చేశానని తెలిపారు. ఆ సమయంలో హోటల్ సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపమన్నారని వివరించారు. తాను తన ఫోన్ లో కోవిన్ యాప్ లో ఉన్న డిజిటల్ సర్టిఫికెట్‌ను చూపిస్తే.. తన కుమారుడు తన పర్సులో నుంచి పేపర్ సర్టిఫికెట్ తీసి వారికి చూపించాడన్నారు.
ఈ ఘటనతో డిజిటలైజేషన్ మనదేశంలో ఉన్నట్టు అమెరికాలో లేదని అర్థమైందన్నారు. అమెరికా కంటే మనమే గొప్ప అని అనిపించిందని మంత్రి జైశంకర్ ఆనాటి ఘటనను వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను ఫోన్‌లోనే కలిగి ఉండేలా చూడడం కోసమే CoWIN ప్లాట్‌ఫారమ్‌ను ప్రవేశపెట్టామని జైశంకర్ తెలిపారు.
తాను తన కుమారుడి పేపర్ సర్టిఫికెట్ ని చూశానన్నారు. మా సర్టిఫికెట్ ఇదిగో కోవిన్ యాప్ లో ఉందని చూపాను.. మీరు ఇంకా ఇక్కడే (పేపర్ సర్టిఫికెట్ రూపం) ఉన్నారని అని అడిగానన్నారు. ఈ నేపథ్యంలో జై శంకర్ కామెంట్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
కాగా భారతదేశంలో 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిను డోస్‌లను అందించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్లు వేసినవారందరినీ అభినందిస్తూ ఒక లేఖ రాశారు. మహమ్మారి వ్యాప్తి తరువాత సంక్షోభ సమయంలో భారతదేశం సాధించిన విజయానికి రాబోయే తరాలు గర్వపడతాయని మోడీ నొక్కిచెప్పారు.
కాగా అమెరికాలో కోవిడ్ టీకా సర్టిఫికెట్‌ను యాప్ ద్వారా పొందడానికి జో బైడెన్ సర్కారు నిరాకరించింది. దీంతో ఇప్పటికీ అమెరికన్లు టీకా సర్టిఫికెట్ కోసం సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మీదే ఆధారపడాల్సి వస్తోంది.