Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తి.. ఏడాదిలో ఎంత పెరిగిందో తెలిస్తే..!

By:  Tupaki Desk   |   17 Aug 2022 10:47 AM GMT
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తి.. ఏడాదిలో ఎంత పెరిగిందో తెలిస్తే..!
X
రాజ‌కీయాల్లో ఉన్న‌వారు నాలుగు రాళ్లు పోగేసుకోవ‌డం మామూలే. కానీ, తాము ఇత‌ర పార్టీల‌కు భిన్నంగా ఉంటామ‌ని.. ఆస్తుల కోసం కాదు.. దేశం కోసం రాజ‌కీయాల్లోకి వ‌స్తామ‌ని చెప్పే బీజేపీ నేత‌ల ఆస్తులు కూడా భారీ ఎత్తున పెర‌గ‌డం..

ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి ఆస్తులు ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా రూ.4 కోట్ల రూపాయ‌లు పెరిగ‌డం.. ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

కిషన్ రెడ్డి తన వ్యక్తిగత, కుటుంబ ఆస్తులు, అప్పులను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించారు. కిషన్ రెడ్డి కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ.22.54 కోట్లుగా, అప్పులు రూ.1.59 కోట్లుగా ఉన్నా యి.

2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి కుటుంబ ఆస్తుల విలువ రూ.4.34 కోట్ల మేర పెరగగా, అప్పులు రూ.7 లక్షల మేర తగ్గాయి.

కిషన్‌రెడ్డి పేరు మీద వ్యక్తిగతంగా రూ.1.44 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి కావ్య పేరు మీద రూ.12.83 కోట్ల ఆస్తులు, రూ.75,16,190 అప్పులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఆమె వ్యక్తిగత ఆస్తి రూ.6,46,88,046 మేర, అప్పు రూ.75,16,190 మేర పెరిగింది. హిందూ ఉమ్మడి కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) పేరు మీదున్న ఆస్తి విలువ (రూ.1,23,23,000) ఏమాత్రం మారలేదు.

కుమార్తె వైష్ణవి పేరున రూ.5.51 కోట్ల ఆస్తి, రూ.84.33 లక్షల అప్పు ఉంది. ఈమె ఆస్తి విలువ గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.1.87 కోట్లు, అప్పు రూ.76.66 లక్షల మేర తగ్గింది. కుమారుడు జి.తన్మయ్‌ పేరిట రూ.97,52,600 ఆస్తులున్నాయి. ఆయన ఆస్తి గత ఏడాది కంటే రూ.95,15,000 పెరిగింది.