Begin typing your search above and press return to search.

ఏపీలో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి..!

By:  Tupaki Desk   |   14 July 2022 11:30 AM GMT
ఏపీలో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి..!
X
ఏపీలో కేంద్ర మంత్రి ఒక‌రు చ‌క్రం తిప్పుతున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి గ‌తంలో 2014 లో ఏపీ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ, 2019 ఎన్నికల విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఏపీ నుంచి ఎవ‌రూ కేంద్ర మంత్రులు లేరు. అయినా.. కూడా ఇటీవ‌ల కాలంలో ఒక కేంద్ర మంత్రి రాజ‌కీయ ప‌రంగా దూకుడు చూపిస్తున్నార‌నే టాక్ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే తెలంగాణ‌కు చెందిన కిష‌న్ రెడ్డి. త‌ర‌చుగా ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఏపీపై దృష్టి పెట్టారు.

కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కిష‌న్ రెడ్డి ఏ రేంజ్‌లో చ‌క్రం తిప్పార‌నే విష‌యాన్ని గ‌మ‌నించ‌వొచ్చు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో నిర్వ‌హించిన అల్లూరి కార్య‌క్ర‌మంలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించార‌నే పేరు ఆయ‌న‌కు వ‌చ్చింది.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుల నుంచి అధికార పార్టీ నేత‌ల వ‌ర‌కు ఆయ‌న స‌మ‌న్వ‌యం చేయ‌డం.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోవ‌డం.. ఏపీ ప‌రంగా.. ప్ర‌ధానికి బ్రీఫింగ్ ఇవ్వ‌డం.. వంటి అనేక విష‌యాల్లో ఆయ‌న చొర‌వ చూపించారు.

ఇక‌, తాజాగా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ముర్ము విష‌యంలోనూ..ఆయ‌న చ‌క్రం తిప్పారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న బీజేపీ, టీడీపీ నేత‌ల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకువ‌చ్చారు.

ఈ కార్య‌క్ర‌మం వెనుక కేంద్ర మంత్రి చ‌క్రం తిప్పార‌నే వాద‌న జోరుగా వినిపిస్తోంది. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి వైసీపీ ముందుగా నే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. కానీ, చంద్ర‌బాబు టీడీపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి కిష‌న్ చొర‌వ‌తోనే ముర్ముకు టీడీపీ మ‌ద్ద‌తు తెలిపింద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. వైసీపీని, ఇటు వైపు టీడీపీని కూడా కిష‌న్ రెడ్డి మేనేజ్ చేయ‌డం.. రాజ‌కీయంగా బ‌ల‌మైన సంకే తాలు ఇస్తున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం బీజేపీ జ‌న‌సేన‌తో క‌లిసి ఉంది.

కానీ, ఆ పార్టీని కూ డా ప‌క్క‌న పెట్టి మ‌రీ.. వైసీపీ, టీడీపీల వెనుక కిష‌న్ రెడ్డి తిర‌గ‌డం ఆస‌క్తిగా మారింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ విష‌యంలో కిష‌న్ దూకుడు పెంచుతారా? పార్టీల‌ను స‌మ‌న్వ‌యం చేయాల్సి వ‌స్తే.. ఆయ‌న ఎటు వైపు ఉంటారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా... ఇప్ప‌టికి ఉన్న రాజ‌కీయాల‌ను బ‌ట్టి చూస్తే.. కిష‌న్ దూకుడు ఏపీపై బాగానే ఉంద‌ని అంటున్నారు.