Begin typing your search above and press return to search.

ఉప ఎన్నిక కోసం.. ఇన్ని పాట్లా.. బీజేపీ ప‌రువు పోవ‌ట్లే!!

By:  Tupaki Desk   |   1 Nov 2020 5:35 PM GMT
ఉప ఎన్నిక కోసం.. ఇన్ని పాట్లా.. బీజేపీ ప‌రువు పోవ‌ట్లే!!
X
ఒక్క సీటు.. అందునా.. ఉప ఎన్నిక‌.. అది కూడా సెంటిమెంటుతో ముడిప‌డిన‌.. ఎమ్మెల్యే హ‌ఠాన్మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప పోరు. దీనిని సిట్టింగ్ పార్టీ త‌ప్ప.. ఇత‌ర పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటాయా? ఇక్క‌డ గెలిచి గుర్రం ఎక్కాల్సిందే! అని గీత గీసుకుంటాయా? అంటే.. గ‌తంలో ఏమో.. కానీ, ఇప్పుడు మాత్రం తెలంగాణ‌లోని దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ తీరు చూస్తే.. అలానే ఉంది. ఒక్క స్థానం కోసం.. అందునా.. సెంటిమెంటు, సింప‌తీతో ముడిప‌డిన సీటు కోసం.. బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న తీరు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఎన్నిక‌లన్నాక‌.. వ్యూహం ఉండాల్సిందే.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల్సిందే.

కానీ, దానికి కూడా స‌మ‌యం, సంద‌ర్భం ఉండాలి క‌దా! పైగా.. దుబ్బాక ఉప పోరులో గెలిచేందుకు బీజేపీ త‌ర‌ఫున ఏకంగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి స్వ‌యంగా ఢిల్లీ నుంచి క‌దిలి వ‌చ్చి హైద‌రాబాద్‌లో తిష్ట‌వేసి.. అంతా క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపించ‌డం నిజంగానే బీజేపీకి ఎక్క‌డో మ‌నోధైర్యం స‌డ‌లిపోయిందనేవ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పోనీ.. ఈ సీటును గెలుచుకుంటే.. అధికారం ద‌క్కుతుందా? అంటే అది కూడా లేదు. అంతేకాదు.. బీజేపీ కి ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉంద‌ని, మోడీ విధానాల‌కు ప్రజ‌లు ఫిదా అవుతున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు నిత్యం వ‌ల్లె వేస్తున్నారు.

మ‌రి అలాంట‌ప్పుడు దుబ్బాక‌లో ఈ సూత్రాలు ప‌నిచేయ‌డం లేదా? లేక‌.. ఇంత‌లోనే బీజేపీ బ‌లం త‌గ్గిపో యిందా? పైగా ఇక్క‌డ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా ఉన్న ర‌ఘునంద‌న్‌రావు.. నోట్లో మాట‌లు లేని మ‌నిషేం కాదు.. గ‌తంలో టీఆర్ ఎస్ లో ప‌నిచేసిన నాయ‌కుడే.. ప్ర‌జ‌ల‌ను ఎలా త‌న‌వైపున‌కు తిప్పుకోవాలో తెలిసిన నేతే. అయినప్ప‌టికీ.. కేంద్ర‌మంత్రి స్థాయిలో ఉన్న‌తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన కిష‌న్ రెడ్డి నేరుగా ఇక్క‌డే మ‌కాం వేయ‌డం, త‌మిళ‌నాడు నుంచి ఐపీఎస్ అధికారిని ర‌ప్పించి.. ఇక్క‌డ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నియోగించేలా చ‌క్రం తిప్ప‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఒక్క‌సీటు కోసం.. అందునా .. మ‌రో మూడేళ్ల‌పాటుండే ప‌ద‌వి కోసం పాకులాడ‌డం వంటివి పార్టీపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం లేక‌నే ఇలా చేస్తున్నార‌న్న సంకేతాల‌ను పంపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.