Begin typing your search above and press return to search.

గాంధీ, నెహ్రూలపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   15 Dec 2022 11:07 AM GMT
గాంధీ, నెహ్రూలపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!
X
గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూలపై కేంద్ర సహాయ మంత్ర కిశోర్‌ కౌశల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ డ్రగ్స్‌ వాడేవారన్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగిన నషా ముక్తి జాగరణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ డ్రగ్స్‌ వాడేవారన్నారు. అంతేకాదు, మహాత్మాగాంధీ కుమారుడు కూడా ఇదే రీతిలో డ్రగ్స్‌ వాడేవారన్నారు.

కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌ వ్యాఖ్యల వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌ అయింది. అందులో ఉన్నదాని ప్రకారం.. ‘మహాత్మా గాంధీ కుమారుడు, మాజీ మాదకద్రవ్యాల వినియోగదారు అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా సిగరెట్‌ తాగారు, మీరు తెలుసుకోవాలి.

డ్రగ్స్‌ వ్యాపారం మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించింది. డ్రగ్స్‌ వల్ల కలిగే వివిధ హాని గురించి ప్రజలు తెలుసుకోవాలి. పాయిజన్‌ షాపులు లేని విధంగా మందుల దుకాణాలను మూసివేస్తాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

వాస్తవానికి, కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ తరచుగా డ్రగ్స్‌ దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. డ్రగ్స్‌ పట్ల నిరంతరం అవగాహన పెంచుతుంటారు. ఇది ఆయన ట్విట్టర్‌ ఖాతా చూసినా అర్థమవుతుంది.

కౌశల్‌ కిశోర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జాతీయ నాయకులను అవమానించడం బీజేపీ నేతలకు ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తుతున్నారు. కౌశల్‌ కిశోర్‌ ను ప్రధాని మోడీ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కౌశల్‌ కిశోరే కాకుండా గతంలో పలువురు మంత్రులు, బీజేపీ నేతలు సైతం గాంధీ, నెహ్రూల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రతి తప్పుకు నెహ్రూ విధానాలే కారణమని నీచమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.