Begin typing your search above and press return to search.

రతన్ టాటా ప్రశ్నతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి షాక్

By:  Tupaki Desk   |   15 April 2022 5:35 AM GMT
రతన్ టాటా ప్రశ్నతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి షాక్
X
కేంద్రంలోని హిందుత్వ బీజేపీకి దిగ్గజ పారిశ్రామికవేత్త వెలిబుచ్చిన సందేహం ఇప్పుడు సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఆర్ఎస్ఎస్ అగ్రనేత కేబీ హెడ్గేవార్ పేరుతో ఓ ఆస్పత్రి నిర్మించారు. ఈ ఆస్పత్రి ప్రారంభానికి వచ్చిన రతన్ టాటా సూటి ప్రశ్న వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించాడు.

‘ఆర్ఎస్ఎస్ ఆస్పత్రిలో హిందువులకే వైద్యం చేస్తారా?’ అని రతన్ టాటా అడిగారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి గడ్కరీయే బయటపెట్టడం విశేషం. దానికి తాను రతన్ టాటాకు ఏమని సమాధానం ఇచ్చాడో కూడా తెలిపారు.

‘గతంలో తనను రతన్ టాటా ఓ ప్రశ్న అడిగాడని అలా ఎందుకు అనుకుంటున్నారని తాను బదులిచ్చానని తెలిపారు. ఈ ఆస్పత్రి ఆర్ఎస్ఎస్ కు చెందినది కదా? అని ఆయన అనగా.. ఈ ఆస్పత్రి ఎందుకు ఏర్పాటు చేసింది తాను వివరించానన్నారు.

ఆర్ఎస్ఎస్ ఆస్పత్రి మతం ఆధారంగా వివక్ష చూపించదని.. ఇది అన్ని వర్గాల వారికీ చెందినదని టాటాకు తెలిపానని గడ్కరీ వివరించారు. మతాల ఆధారంగా ఇక్కడ వివక్ష చూపించడం జరగదని తెలిపానన్నారు. దాంతోపాటు ఆస్పత్రి గురించి అన్ని విషయాలు వివరించడంతో రతన్ టాటా సంతోషించారని గడ్కరీ పేర్కొన్నారు.

ఆర్ఎస్ఎస్ అంటే పక్కా హిందుత్వ సంస్థ. దీనిపై ముస్లిం నేతలు, వర్గాల్లో ఒకరకమైన అభిప్రాయం ఉంది. ఈ సంఘానికి అనుబంధంగా బీజేపీ ఉండడం.. ఆ నేతలే ఆస్పత్రి ప్రారంభించడంతో ఈ అనుమానాన్ని టాటా కూడా వ్యక్తం చేశారు.

కానీ ఈ ఆస్పత్రి పేదల కోసం కట్టిందని.. ఆర్ఎస్ఎస్ నేత పేరు పెట్టినంత మాత్రానా కొన్ని వర్గాలకు ప్రవేశం లేదనడం కరెక్ట్ కాదని గడ్కరీ క్లారిటీ ఇచ్చారు.