Begin typing your search above and press return to search.
గడ్కరీ తూటలు ఎవరి మీద : ఇదేమి రాజకీయం..నాకొద్దు సామీ ...?
By: Tupaki Desk | 26 July 2022 4:20 AM GMTఆయన బీజేపీలో పేరు మోసిన నేత. కేంద్ర మంత్రివర్గంలో కానీ బీజేపీలో కానీ తన ప్లేస్ ని ఎవరూ కాదనలేని తోసిరాజనలేని బలవంతుడు. నాగపూర్ ఆరెస్సెస్ ఆఫీస్ కి బహు దగ్గర మనిషి. మోడీని ఈ రోజుకు ప్రధానిగా వద్దే వద్దు అనుకుంటే ఆ నెక్స్ట్ తట్టే పేరు ఆ సీట్లోకి వచ్చే వారూ నితిన్ గడ్కరీ మాత్రమే అని ఎవరైనా చెప్పే విషయం. అలాంటి మేరు నగధీరుడు గడ్కరీకి రాజకీయాల మీద విసుగు పుడుతోందిట.
ఒక విధంగా ఆయనకు వేదాంతమే అవహించిందిట. ఎందుకీ రాజకీయాలు ఎవరి కోసం అంటూ ఆయన తనలో తానే కుములుతూ ఆ మాటలను బయటకు అనేశారు. నాగ్ పూర్ లో మాజీ రాజకీయ నేత గిరీష్ గాంధీని సన్మానించిన సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలుచేశారు. అంతే అవి ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. కేంద్రంలో బ్రహ్మాండమైన మెజారిటెతో అధికారంలో ఉన్న బీజేపీలో అత్యంత కీలక నాయకుడు ఏమిటీ రాజకీయం కేవలం అధికార వ్యామోహం అంటే ఉలిక్కిపడేవారు అందులోనే ఎక్కువగా ఉంటారు.
ఎందుకంటే గడ్కరీ అన్న మాటలు చిన్నవి కావు. సమాజ హితం కోసం అభివృద్ధి కోసం పనిచేసేలా ఈనాటి రాజకీయాలు లేవు అని ఆయన మాటల తూటలే పేల్చారు. అంతే కాదు ఎంతసేపూ అధికారాన్ని అనువించడమే రాజకీయం అని అర్ధంగా మార్చేసుకున్నారు అని కూడా ఆయన ఆవేదన చెందారు. ఇలాంటి రాజకీయాలు అవసరమా అని తనకు తరచూ అనిపిస్తోందని, ఎప్పుడెప్పుడు తాను తప్పుకుందామా అని కూడా అనిపిస్తోందని ఆయన తనలోని వేదాంత భావనను బయటపెట్టుకున్నారు.
రాజకీయాలు అంటే సామాజిక మార్పునకు అవకాశంగా ఉండాలని, అలాగే అభివృద్ధికి వాహకంగా ఉండాలని ఆయన అభిలషించారు మహాత్మా గాంధీ కాలం నుంచి కూడా రాజకీయాలు అంటే అవేనని, వాటి అర్ధం పరమార్ధం కూడా ఇపుడు పూర్తిగా మారిపోయిందని ఆయన కలత చెందారు.
ఇక తన దాకా ఆలోచించుకుంటే తాను ప్రభుత్వంలో ఉండాలా లేక సమాజ హితం కోసం పనిచేయాలా దేశాభివృద్ధిలో భాగం కావాలా అని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకున్నారు. గతంలో రాజకీయాలు జాతి హితం కోసం అభివృద్ధి లక్ష్యాల కోసం ఉంటే ఇపుడు మాత్రం అవి బొత్తిగా అధికారాన్ని అనుభవించేందుకే ఉన్నాయని గడ్కరీ బాగానే చురకలు అంటించారు.
ఒక విధంగా బీజేపీలో చోటు చేసుకుంటున్న మార్పులు, అధికారం కోసం వేస్తున్న ఎత్త్లు పై ఎత్తులు, దానికి ముంచి రీసెంట్ గా గడ్కరీ సొంత రాష్ట్రం మహారాష్టలో రాస్త్రికి రాగ్త్రి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ ప్లేస్ లో ఏక్ నాధ్ షిండేను తెచ్చి ప్రతిష్టించి అధికారం అందుకున్న బీజేపీ పోకడలు దేశంలో విపక్షాలను టార్గెట్ చేస్తూ ఒక్కో రాష్ట్రం తమ సొంతం కావాలని బీజేపీ పెద్దలు చేస్తున్న వికృత రాజకీయ క్రీడను చూసిన మీదటనే గడ్కరీలో ఈ తరహా రాజకీయ వైరాగ్యం వచ్చిందా అన్న చర్చ అయితే చాలా గట్టిగానే లోపలా బయటా సాగుతోంది. ఏది ఏమైనా గడ్కరీ కామెంట్స్ అధికారంలో ఉన్న పార్టీకే నేరుగా తాకుతాయని అంటున్నారు.