Begin typing your search above and press return to search.
మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..ఎవరంటే!
By: Tupaki Desk | 27 Oct 2020 12:31 PM GMTకరోనా మహమ్మారి ఎవరిపై , ఎప్పుడు , ఎలా దాడి చేస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సామాన్యుల నుండి సెలెబ్రెటీలు , రాజకీయ ప్రముఖులు , ప్రజాప్రతినిధులు , విఐపిలు ప్రతి ఒక్కరు కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇక కరోనా భారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దేశంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీలు , మంత్రులు , ముఖ్యమంత్రులు , కేంద్రమంత్రులు కూడా కరోనా భారిన పడ్డారు. తాజాగా మరో కేంద్ర మంత్రి కూడా కరోనా భారిన పడ్డారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) అధినేత, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలేకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. తాజాగా ఆయనకి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా .. ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా ఈ పార్టీలో నటి పాయల్ ఘోష్ చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పిన కార్యక్రమంలో రామ్ దాస్ అథవాలే పాల్గొన్నారు. అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసింది.కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నిర్ధారించింది. ప్రస్తుతం రామ్ దాస్ అథవాలే ప్రస్తుతం దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఇకపోతే , తనకి కరోనా పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసుకోవాలోని తెలిపారు. ఆ పరీక్షల్లో నెగటివ్ వస్తేనే బయటికి రావాలని తెలిపారు.