Begin typing your search above and press return to search.
పార్లమెంటు ఆవరణలో పరుగులు తీసిన కేంద్రమంత్రి.. కారణమిదే
By: Tupaki Desk | 5 Dec 2019 4:48 AM GMTఆయన సాక్ష్యాత్తు కేంద్రమంత్రి. అలాంటి ఆయన బుధవారం పార్లమెంటు ఆవరణలో పరుగులు తీశారు. కాలేజీ కుర్రాడి మాదిరి కారులో నుంచి హడావుడిగా దిగిన ఆయన.. చేతిలో పేపర్లను పట్టుకొని.. ఎగ్జామ్ టైంకు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్లేందుకు రివ్వున ఎలా దూసుకెళతారో.. ఇంచుమించు అదే స్టైల్లో పరుగులు తీసిన వైనం ఆసక్తికరంగా మారింది.
ఇంతకీ ఎందుకిలా చేసినట్లు? కేంద్రమంత్రి హోదాలో ఉండి పరుగులు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకీ పార్లమెంటు ఆవరణలో పరుగులు తీసి అందరి కంట్లో పడిన కేంద్రమంత్రి ఎవరో కాదు.. కేంద్ర రైల్వే శాఖామంత్రి పీయూష్ గోయల్. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో హాజరయ్యేందుకు ఆయన పార్లమెంటు వద్దకు వచ్చారు.
తన కారు పార్లమెంటు భవనం వద్దకు వచ్చీ రాగానే.. ఒక్క ఉదుటున కారులో నుంచి బయటకు దిగిన ఆయన.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరుగు తీశారు. ఎందుకిలా అంటే.. సమయానికి పార్లమెంటుకు చేరుకోవటమేనని చెబుతున్నారు. తాజాగా ఆయన పరుగులు తీస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి సమయపాలనపై అందరూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేస్తుంటే.. కాస్త ముందు జాగ్రత్తగా ఉంటే.. ఈ పరుగులు తీసే పని తగ్గేది కదా? అని ప్రశ్నించేటోళ్లు కూడా లేకపోలేదు. కాకుంటే.. నెగిటివ్ కంటే పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నోళ్లే ఎక్కువని చెప్పక తప్పదు.