Begin typing your search above and press return to search.

డీఆర్‌డీవో 2డీజీ డ్రగ్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   17 May 2021 1:30 PM GMT
డీఆర్‌డీవో  2డీజీ డ్రగ్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు !
X
కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న ఈ సమయంలో డీఆర్డీఓ మరో గుడ్ న్యూస్ చెప్పింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్ర‌గ్ 2-డీజీ జూన్ తొలివారంలో దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుంద‌ని డీఆర్డీఓ చైర్మ‌న్ జీ స‌తీష్ రెడ్డి వెల్ల‌డించారు. తొలి బ్యాచ్ డ్ర‌గ్ లాంఛ‌నంగా సోమ‌వారం ప్రారంభం కాగా ప్ర‌స్తుతం ఎయిమ్స్, సాయుధ ద‌ళాల ఆస్ప‌త్రులు, డీఆర్డీఓ ఆస్ప‌త్రుల‌తో పాటు అవ‌స‌ర‌మైన ఆస్ప‌త్రుల్లో వాడ‌తార‌ని చెప్పారు. ఇక ,జూన్ నుంచి దేశ‌వ్యాప్తంగా అన్ని ఆస్ప‌త్రుల్లో 2-డీజీ మందు అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు.

జూన్ మొదటివారం నుంచి రెగ్యుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ ఊపందుకుంటుంద‌ని వెల్ల‌డించారు. డీసీజీఐ నుంచి డ్ర‌గ్ కు అనుమ‌తి ల‌భించిన‌ప్ప‌టి నుంచి ప‌రిశ్ర‌మ స‌హ‌కారంతో ఉత్ప‌త్తిని పెంచేందుకు శ్ర‌మించినా సాధార‌ణ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం చేరుకునేందుకు నెల‌రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు. 2-డీజీ మందు ప‌నితీరును వివ‌రిస్తూ శ‌రీరంలో కరోనా వైర‌స్ మహమ్మారి దాగిన క‌ణాల్లోకి నేరుగా ఈ మందు వెళ్లి వైర‌స్ వ్యాప్తిని ఇత‌ర ఆరోగ్యంగా ఉన్న క‌ణాల్లోకి చేర‌కుండా నిరోధిస్తుంద‌ని చెప్పారు. డీఆర్డీఓ తయారు చేసిన 2డీజీ పై కేంద్ర ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఆర్‌ డీవో తయారు చేసిన 2డీజీ డ్రగ్ భారత్‌‌ నే కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా కాపాడుతుందని ఆయన అన్నారు. డాక్టర్ రెడ్డీస్‌ సహకారంతో తయారు చేసిన తొలి బ్యాచ్ 2డీజీ డ్రగ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో కలసి హర్షవర్థన్ ఆవిష్కరించారు. ఈ డ్రగ్ కరోనాను అరికట్టడమే కాకుండా కరోనా బాధితులకి శ్వాస సంబంధిత అవసరాలని తీర్చి , ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందని మంత్రి చెప్పారు. రోజుల్లో కొన్ని 2డీజీ డ్రగ్ కేవలం ఇండియాని మాత్రమే కాదు, ప్రపంచాన్ని కాపాడుతుందని అన్నారు. 2డీజీ ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ విడుదల చేశారు. డ్రగ్‌ను రక్షణ మంత్రి విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో అందుబాటులో ఉన్న ఈ 2డీజీ డ్రగ్‌ను నీటితో కలిపి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీవో పేర్కొంది.