Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లుక్ చూశారా? వెయిట్ లాస్ అయి మెరిసిపోతున్నారే!

By:  Tupaki Desk   |   20 Aug 2021 2:56 AM GMT
కేంద్ర  మంత్రి స్మృతి ఇరానీ లుక్ చూశారా?  వెయిట్ లాస్ అయి మెరిసిపోతున్నారే!
X
కేంద్ర మంత్రి, స్మృతి ఇరానీ.. తాజాగా సోష‌ల్ మీడియాలో పెట్టిన ఫొటో భారీ ఎత్తున వైర‌ల్ అవుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఆమె ఫొటోను చూసి మంత్ర‌ముగ్ధులైనట్టు ఉండిపోతున్నారు. దీనికి కార‌ణం.. ఆమె వెయిట్ లాస్(బ‌రువు త‌గ్గించుకోవ‌డం) కావ‌డ‌మే. న‌టిగా.. ప్ర‌స్థానం ప్రారంభించిన స్మృతి ఇరానీ.. త‌ర్వాత రాజ‌కీయ నాయ‌కురాలిగా మారిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడయడియాలో చురుగ్గా ఉండే స్మృతి ఇరానీ.. తాజాగా కొన్ని ఫొటోల‌ను పోస్ట్ చేశారు. బాగ్ స్లిమ్ లుక్‌లో ఉన్న ఫేస్ ఫొటోను ఆమె పోస్ట్ చేశారు.

మండే మంత్ర పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్మృతి ఇరానీ చేసిన పోస్టుకు భారీ సంఖ్య‌లో లైకులు ప‌డ‌డ‌మే కాకుండా... కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చాయి. ముఖానికి మాస్క్ ధ‌రించిన స్టిల్‌తో పాటు.. మ‌రికొన్ని ఫొటోల‌ను ఆమె పోస్టు చేశారు. మాస్కు ధ‌రించే ప్రాధాన్యాన్ని ఈ సంద‌ర్భంగా తాను చెబుతున్న‌ట్టు.. ఆమె.. పోస్టు చేశారు. అంతేకాదు..`` చెవి దిద్దులు, ముక్కుపుడ‌క ఎంత ముఖ్య‌మో.. ముఖానికి మాస్క్ కూడా అంతే ముఖ్యం. మాస్క‌ప్ ఇండియా. వ్యాక్సినేష‌న్ వేయించుకోండి`` అని పేర్కొన్నారు.

స్మృతి ఇరానీ చేసిన ఈ పోస్టుకు వెనువెంట‌నే నెటిజ‌న్ల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చింది. ఆమె సంక‌ల్పానికి ప్ర‌తి ఒక్క‌రి నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ``అస‌లు స్మృతి.. తిరిగి వ‌చ్చింది`` అనే కామెంట్లు కురిశాయి. ``మీరు బ‌రువు త‌గ్గిన త‌ర్వాత‌.. స‌రికొత్త‌గా ఉన్నారు`` ``ఎంత మార్పు మీలో.. నిజంగా.. మీరు స్ఫూర్తిగా నిలిచారు``ఇలా.. అనేక కామెంట్లు నెటిజ‌న్ల నుంచి వ‌చ్చాయి. ఇదిలావుంటే.. కొన్ని వారాల కింద‌ట‌.. స్మృతి ఇరానీ.. ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు అభిమానులు.. వీరిలో టీవీ స్టార్స్ కూడా ఉన్నారు. వీరంతా.. కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేశారు. ఏక్తాక‌పూర్ కూడా కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

కేంద్ర టెక్స్ టైల్స్, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ.. బుల్లితెర న‌టిగా.. ఎంతో పేరు తెచ్చుకున్నారు. అనంత‌ర కాలంలో రాజ‌కీయ అరంగేట్రం చేశారు. 2000లో వ‌చ్చిన‌ ఆతిష్, హ‌మ్ హెయిన్ కాల్ ఆజ్ ఔర్ కాల్ సీరియ‌ల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. డీడీ మెట్రోలో క‌విత‌లు కూడా రాసేవారు. ఏక్తా క‌పూర్ తీసిన ` కుంతిసాస్ భి క‌భి బాహు థీ `తో స్మీతి మంచి గుర్తింపు పొందారు.