Begin typing your search above and press return to search.

షాకిచ్చిన మోడీ: జవదేకర్, రవిశంకర్ ఔట్

By:  Tupaki Desk   |   7 July 2021 1:44 PM GMT
షాకిచ్చిన మోడీ: జవదేకర్, రవిశంకర్ ఔట్
X
కేంద్ర కేబినెట్ ను పునర్వ్యస్థీకరిస్తున్నట్టు చెప్పిన ప్రధాని మోడీ ఈ రేంజ్ లో షాకిస్తాడని ఎవరూ ఊహించలేదు. మోడీ కేబినెట్ లో సీనియర్ అనుభవం ఉన్న మంత్రులైన కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లు రాజీనామా చేయడం పెను సంచలనమైంది. ప్రధాని మోడీతో సన్నిహితంగా ఉన్న ముఖ్య నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తుండడం సంచలనంగా మారింది.

ఇప్పటికే కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, రమేశ్ ప్రొక్రియాల్ సహా 10 మంది రాజీనామా చేసి షాకిచ్చారు. ఇప్పుడు ఆ జాబితాలో రవిశంకర్, జవదేకర్ లాంటి సీనియర్లు కూడా చేరడం సంచలనమైంది. వీరిద్దరి రాజీనామా జాతీయ స్థాయిలో కలకలం రేపింది. కీలక శాఖలు చూస్తున్న వీరిద్దరి రాజీనామా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఈ పనిచేసినట్టు తెలుస్తోంది.జవదేకర్, రవిశంకర్ తోపాటు రాజీనామా చేసిన వారి సంఖ్య మొత్తం 14కు చేరింది. వారి రాజీనామాలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.

రవిశంకర్ మోడీ కేబినెట్ లో కీలకమైన ఐటీ, న్యాయశాఖలు చూస్తున్నారు. ఇక జావదేకర్ పర్యావరణ శాఖ చూస్తున్నారు.గత కేబినెట్ విస్తరణలోనే పనితీరు బాగుందని జావదేకర్ కు ప్రమోషన్ ఇచ్చిన మోడీ ఇప్పుడు తీసేయడం సంచలనమైంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా వీరి సేవలను పార్టీకి వాడుకోవాలని.. వీరిని పార్టీ పదవుల్లో నింపుతారని తెలుస్తోంది.

ప్రధాని మోడీ తన కొత్త క్యాబినెట్లో 43 మంది కొత్త మంత్రులను తీసుకుంటున్నారు. సీనియర్లకు మంగళం పాడి కొత్తవారిని, యువతకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పునర్వ్యవస్థీకరణలలో ఈసారి కిషన్ రెడ్డితోపాటు జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరెన్ రిజిజు, మీనాక్షి లేఖి మోడీ మంత్రివర్గంలో ప్రమోషన్ పొంది కేంద్రమంత్రులుగా కొనసాగనున్నారు.

హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న సికింద్రాబాద్ ఎంపి కిషన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదోన్నతి కల్పించారు. కిషన్ రెడ్డిని ఫుల్ టైం కేబినెట్ మంత్రిగా చేయనున్నారు. కిషన్ రెడ్డికి కొత్తగా మార్చిన సహకార శాఖ అప్పగించినట్టు తెలిసింది.