Begin typing your search above and press return to search.
రైల్వే మంత్రి రివర్స్ అటాక్: వైసీపీ వల్లే 70 వేల కోట్ల పనులకు బ్రేక్
By: Tupaki Desk | 27 July 2022 10:46 AM GMTవైసీపీ అడిగి మరీ విమర్శలు చేయించుకుందా అంటే జవాబు అవును అని వస్తోంది. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల సంగతేంటి అంటూ ఆ పార్టీ ఎంపీ బాలశౌరి ఈ రోజు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ సర్కార్ ని కడిగేశారు. పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు.
ఏపీలో దాదాపుగా డెబ్బై వేల కోట్ల పనులు ఆగడానికి వైసీపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరే కారణం అని కేంద్ర మంత్రి చెప్పడంతో తప్పు అంతా వైసీపీది అయినట్లు అయింది. ఏపీలో ఎన్నో ప్రాజెక్టులను తాము చేపడుతున్నామని, కానీ వాటికి సంబంధించి ప్రాజెక్టునకు అయ్యే వ్యయంలో రాష్ట్రం తన వాటా ఎక్కడా చెల్లిచడం లేదు అని కేంద్ర మంత్రి రివర్స్ లో ఫైర్ అయ్యారు.
కొత్త ప్రాజెక్టుల ఖర్చుని షేరింగ్ విధానంలో చేపడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ప్రాజెక్ట్ కి అయ్యే వ్యయంలో తన వాటాగా ఏపీ సర్కార్ చెల్లించాల్సింది ఇవ్వడంలేదని ఆయన మండిపడ్డారు.
ఇక రైల్వే శాఖకు ఏపీ సర్కార్ 1798 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని కూడా అసలు విషయం సభలోనే బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ఏపీలో కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడం అంటే కష్టమే అంటూ చేతులెత్తేశారు. ఉన్న వాటిని పూర్తి చేసుకుంటే అదే పదివేలు అన్నట్లుగా ఏపీలో పరిస్థితి ఉందని, కొత్త ప్రాజెక్టుల ఊసే ఇక ఉండదని కూడా అనేసారు
ఏపీ సర్కార్ తో చెప్పించి రైల్వే శాఖకు రావాల్సిన నిధులను ఇప్పించాలని మంత్రి గానే వైసీపీ ఎంపీ బాలశౌరిని నేరుగా కోరడం విశేషం. అలా చేస్తే ప్రస్తుతం టేకప్ చేసిన ప్రాజెక్టులు అయినా పూర్తి అవుతాయని అన్నారు.
మొత్తానికి కేంద్రాన్ని ఇరుకున పెడదామని ఏపీకి ఏమీ చేయలేదని చెప్పాలనుకుని వైసీపీ ప్రశ్నించి ఉంటుంది. కానీ అది తమకే రివర్స్ లో గుచ్చుకోవడంతో ఇపుడు గిలగిలలాడడం వైసీపీ వంతుగా ఉంది. మరి ఇది చాలదా ఏపీలో విపక్షాలు రెచ్చిపోవడానికి. రోజుకో కేంద్ర మంత్రి ఏపీ సర్కార్ తీరుని ఎండగడుతూ విపక్షాలకు ఆయుధాలను ఇస్తున్నారులా ఉంది. ఈ వర్షాకాల సమావేశాలు వైసీపీకి బొత్తిగా కలసిరావడంలేదు అనుకోవాలి.