Begin typing your search above and press return to search.
యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు 4846 కోట్ల నష్టం
By: Tupaki Desk | 12 April 2017 2:35 PM GMTఅమెరికాలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఓ ప్రయాణికుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు కలకలం రేకెత్తించిన సంగత తెలిసిందే. నోటి నుంచి రక్తం కారుతున్నా... ప్లైట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లి కింద పడేసిన ఘటనపై రచ్చ జరగడంతో తప్పని పరిస్థితుల్లోనే అతన్ని దింపామని సమర్థించుకుంది. అన్నివైపుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో ప్రయాణికుడిని లాగిన అధికారిని ఎయిర్ లైన్స్ సస్పెండ్ చేసింది. కానీ తాజాగా దిమ్మ తిరిగిపోయే షాక్ ఆ సంస్థకు ఎదురైంది. అరాచకంగా వ్యవహరించిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ షేర్ భారీగా దెబ్బతింది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ.4,846 కోట్ల నష్టం వాటిల్లింది.
చికాగో ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటన అనంతరం 22.75 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ క్యాపిటల్ వాల్యూ ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే 21.70 స్థాయికి పడిపోయింది. ఈ ఘటనతో దిమ్మ తిరిగిపోయిన సంస్థ తనకు జరిగిన అపార నష్టాన్ని ఏకరువు పెట్టింది. ప్రయాణికుడి ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత సుమారు 830 మిలియన్ డాలర్ల విలువ గల నష్టం జరిగినట్లు తెలిపింది. యునైటెడ్ కాంటినెంటల్ హోల్డింగ్స్ ఐఎన్‌సీ పేరుతో ప్రస్తుతం ఈ సంస్థ షేర్ 70.15 యూఎస్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.అంటే భారతీయ విలువలో చెప్పాలంటే రూ.4846 కోట్ల నష్టం కలిగిందన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/