Begin typing your search above and press return to search.
ట్రంప్ కు మద్దతిచ్చిన ముస్లిం దేశం
By: Tupaki Desk | 2 Feb 2017 7:23 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులకు అమెరికా ప్రవేశాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో ఊహించని మద్దతు దక్కింది. ట్రంప్ నిర్ణయం ఇస్లాం వ్యతిరేకం కాదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయెద్ అల్ నహ్యాన్ అభిప్రాయపడ్డారు. ఒక మతానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయానికి రావడం తప్పని ఓ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ కూడా హాజరయ్యారు. ''ఓ సార్వభౌమ దేశంగా అమెరికా తీసుకున్న నిర్ణయం అది. దీని ప్రభావం ప్రపంచంలోని అధిక ముస్లింలపై ఉండబోదు'' అని ఆయన చెప్పారు. ఇరాన్ - ఇరాక్ - సిరియా - లిబియా - సోమాలియా - సూడాన్ - యెమెన్ దేశాల ప్రజలకు 90 రోజులపాటు అమెరికాలోకి ప్రవేశాన్ని ట్రంప్ నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకోవైపు ఈ జాబితాలో దేశాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు విశ్వవ్యాప్త ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా భావించే పాకిస్తాన్ పైనా వేటు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారా? అవుననే అంటున్నాయి వైట్ హౌస్ వర్గాలు... అమెరికాలో ప్రవేశించేందుకు వీల్లేకుండా వీసా నిషేధం విధించిన దేశాల సరసన ఇప్పుడు పాకిస్తాన్ ను చేర్చున్నట్టు ప్రకటించాయి. ట్రంప్‌తో మీడియా సంబంధాలపై జార్జ్ వాషింగ్టన్ వద్ద జరిగిన సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్ ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్తాన్ ను మాత్రం ఎందుకు నిషేధించకూడదు. త్వరలో ఆ దేశాన్నీ నిషేధించాల్సి రావచ్చు. ఇంతకు ముందు గుర్తించిన దేశాలను మొదట నిషేధిత జాబితాలో చేర్చాం. 90 రోజుల రివ్యూ సందర్భంగా ఇందులో చేర్చాల్సిన ఇతర దేశాలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చే వారికి వీసాలు నిరాకరిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత... పాకిస్తాన్ ను కూడా ఈ జాబితాలో చేర్చుతారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిషేధం విధించిన దేశాల్లో ఇరాక్ - సిరియా - సూడాన్ - ఇరాన్ - సోమాలియా - లిబియా - యెమెన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇందులో పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ - సౌదీ అరేబియాలను ఎందుకు చేర్చలేదంటూ గత కొద్ది రోజులుగా వైట్ హౌస్ ఉన్నతాధికారులకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/