Begin typing your search above and press return to search.
అమెరికాలో తుపాకుల గర్జన
By: Tupaki Desk | 15 Jun 2017 6:04 AM GMTతుపాకుల కలకలం అమెరికాలో అత్యంత సాధారణమైపోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట తూటాల మోత. తాజాగా మరోసారి అమెరికాలో తుపాకులు గర్జించాయి. యునైటెడ్ పార్సిల్ సర్వీస్ కంపెనీ ప్యాకేజ్ సెక్షన్ వద్ద ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి కాల్పులకు తెగబడి ముగ్గురి ప్రాణాలు తీశాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని మరణించాడు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్ పార్సిల్ సర్వీస్ అనే సంస్థకు చెందిన ఓ ఉద్యోగి కంపెనీ ప్యాకింగ్ హబ్ వద్దకు వెళ్లి అక్కడ తనతోపాటు పనిచేస్తున్న సహచర ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటుండగానే అదే తుపాకీతో తనకు గురిపెట్టుకొని కాల్చుకున్నాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మొత్తం 350మంది ఉద్యోగులు పనిచేసే ఈ కంపెనీ వద్దకు ఈ ఘటనతో భారీ మొత్తంలో పోలీసులు చేరుకున్నారు. అతడు ఎందుకు ఈ కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. కాల్పులలో మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.
కాగా మరో ఘటనలోనూ తూటాల ధాటికి అయిదుగురు గాయపడ్డారు. రిపబ్లికన్ పార్టీ సభ్యులు లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి. వర్జీనియాలోని అలెగ్జాండ్రియా బేస్ బాల్ మైదానంలో రిపబ్లికన్ పార్టీ సభ్యలు కొందరు బేస్ బాల్ సాధన చేస్తున్న సమయంలో ఓ సాయుధుడు తూటాల వర్షం కురిపించాడు.
గాయపడిన వారిలో పార్టీ అగ్ర నాయకుడు, లూసియానా ఎంపీ స్టీవ్ స్కేలీస్ తో పాటు మరో ఎంపీ రోజర్ విలియమ్స్ ఉన్నారు. గురువారం రిపబ్లికన్లు - డెమొక్రాట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం సాధన చేస్తుండగా 50 ఏళ్లకు పైగా ఉన్న ఓ సాయుధుడు మైదానంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు మరణించాడు. కాగా గాయపడిన రిపబ్లికన్ మెంబర్ స్కేలీస్ ఆ పార్టీలో టాప్ 3 నేతల్లో ఒకరు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/