Begin typing your search above and press return to search.
ట్రంప్ పుణ్యం.. విమానంలోనూ కొట్టుకున్నారు
By: Tupaki Desk | 15 Nov 2016 9:35 AM GMTమామూలుగా తాము కోరుకున్న లీడర్ కాకుండా వేరే నాయకుడు గెలిస్తే.. కొంచెం నిట్టూర్చి ఎవరి పనిలో వాళ్లు పడిపోతారు. కానీ అమెరికా ఎన్నికల్లో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా ఎన్నికల్లో గెలిచిన నాయకుడికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు.. ఆందోళనలు చెలరేగుతున్నాయి. ట్రంప్ గెలవడం మీద అమెరికాలో ఓ వర్గం ప్రజలు తీవ్ర అసంతృప్తితో.. అసహనంతో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితం వెలువడిన రోజు మొదలైన నిరసనలు ఇప్పటికీ ఆగలేదు. తాజాగా ట్రంప్ గెలుపు నేపథ్యంలో ఓ విమానంలోనూ ప్రయాణికుల మధ్య పెద్ద గొడవ చెలరేగడం గమనార్హం.
ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు.. ట్రంప్ గెలుపు మీద ప్రయాణికుల్లో వాగ్వాదం మొదలై శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మెక్సికోకు వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో పెద్ద గొడవగా మారింది. ఓ ఆఫ్రో-అమెరికన్ మహిళను అగౌరవపరిచే విధంగా ట్రంప్ మద్దతుదారుడు వ్యాఖ్యలు చేయడంతో ఆమె కన్నీటి పర్యంతమై గొడవ పెరిగింది. రెండు వర్గాలు తీవ్రంగా వాదులాడుకోవడంతో పాటు ఒకరి మీదికి ఒకరు లంఘించడంతో పరిస్థితి అదుపు తప్పింది. గొడవ ముదరడంతో పైలట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ‘‘మనం 35 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్నాం. ఎవరికి ఏ అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ ఇలాంటి సమయాల్లో వాదనలు తగవు’’ అని పైలెట్ సర్దిచెప్పడంతో కాసేపటికి గొడవ సద్దుమణిగింది. ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/